-ప్రధానమంత్రి సహా, దేశమంతా విచారం వ్యక్తంచేసిన ఘటనపై పిచ్చికుక్కలు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నాయి
-దుర్మార్గ ప్రభుత్వపాలన నుంచి చంద్రబాబునాయుడే తమను రక్షిస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉంది
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
-కందుకూరు దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన టీడీపీనేతలు
-పార్టీ జాతీయ కార్యాలయంలో మృతులకు అశ్రునయనాలతో నివాళులు అర్పించిన నేతలు
“దుర్మార్గుల కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడటంకోసం టీడీపీఅధినేత చంద్రబాబుగారు ఒకయజ్ఞంలా ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడం, వారిసాధకబాధకాలు, యోగక్షేమాలు తెలుసుకోవడం టీడీపీకి కొత్తకాదు. స్వర్గీయఎన్టీఆర్ కు లభించిన ప్రజాదరణగానీ, నేడు చంద్రబాబు కి లభిస్తున్న ప్రజామద్ధతుగానీ మాటల్లో వర్ణించలేనిది. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేస్తున్నదారుణాలు, పెడుతన్న బాధలతో ప్రజలు రగిలిపోతున్నారు. ప్రజలు తమకష్టాలు చెప్పుకోవడానికి వారికి టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఒకవేదిక దొరికింది.
చంద్రబాబు నాయుడు తమను రక్షించడానికి, తమగోడు వినడానికి తమ ముందుకు వస్తున్నాడని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.ఆ క్రమంలో నిన్న కందుకూరులో టీడీపీ అధినేత సభకు ఊహకందని విధంగా తరలివచ్చిన జనసందోహంలో తొక్కిసలాట జరిగి, దురదృష్టవశాత్తూ టీడీపీ కుటుంబసభ్యులు 8మంది మరణించారు. వారి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఎవరైతే నిన్న కందుకూరులో తొక్కిసలాటలో చనిపోయారో, వారంతా నిజంగా చరిత్రలో వీరులుగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే పోరాటంలోనే వారు అసువులుబాశారు. కాబట్టే వారిని వీరులు అంటున్నాము.
ఘటన జరిగిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబుగారు తన కార్యక్రమాలు రద్దు చేసుకొని, క్షతగాత్రుల్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు.దుర్ఘటన జరిగిన వెనువెంటనే మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు.తెలుగుదేశంపార్టీ తరుపున ఒక్కో కుటుంబానికి రూ.15లక్షల సాయం అందించా ము. అలానే మృతుల కుటుంబాల్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే, వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితవిద్యను అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భవిష్యత్ లో కూడా మృతుల కుటుంబాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందనే ధైర్యం, భరోసా కల్పించారు.
ఇంత దారుణం జరిగితే, కొన్ని పిచ్చికుక్కలు రాజకీయాలు మాట్లాడుతున్నాయి. జరిగిన సంఘటన ఏమిటి.. దానిపై ఎలా మాట్లాడాలనే ఇంగితం లేని పిచ్చికుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాపార్టీ కార్యకర్తలకు సూచిస్తున్నాను. టీడీపీ కార్యకర్తల మృతిపై తెలుగుదేశంపార్టీతో పాటు ప్రధానమంత్రి కూడా స్పందిం చారు. మనపార్టీనేతలు కూడా చేతనైనంత చేయూత అందించారు. మరణించిన మన కుటుంబసభ్యుల ఆత్మలకు శాంతికలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు పార్టీ తరుపున నా ప్రగాఢసానుభూతి, సంతాపం తెలియచేస్తున్నాను”.
నివాళులు అర్పించినవారిలో మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, శాసనమండలిసభ్యులు పరుచూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు ఏ.ఎస్.రామకృష్ణ, ద్వారంపూడి జగదీశ్, మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, హెచ్.ఆర్.డీ. ఛైర్మన్ బూర్ల రామాంజనేయులు, టీ.ఎన్.టీ.యూసీ .రఘురామరాజు, తెలుగురైతు కుర్రానరేంద్ర, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బొద్దులూరి వెంకటేశ్వరరావు, కే.బుచ్చి రాంప్రసాద్, ఎన్. ఆర్.ఐ. కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, ఆహ్వానకమిటీ సభ్యులు హసన్ బాషా, హెచ్.ఆర్.డీసభ్యులు ఎస్పీ.సాహెబ్, రాజేంద్రప్రసాద్, ఎన్.ఆర్.ఈ.జీఎస్.సభ్యులు పీరయ్య, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు పార్టీనేతలు ఉన్నారు.