Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి చేసినంత ద్రోహం బీసీలకు ఏ ఒక్కరూ చేయలేదు

– బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్, హెచ్.ఆర్.డి ఛైర్మన్ పాల్గొన్నారు.
జగన్ పాలనలో బీసీలు అన్యాయానికి, దౌర్జన్యాలకు గురవుతున్నారని, ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయంపై ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీలందరినీ ఏకం చేసేలా సాధికార కమిటీలు పని చేయాలని సూచించారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, కులాల వారీగా సమస్యలపై అధ్యయనం చేసేలా పని చేయాలని సూచించారు.

కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ
టీడీపీ హయాంలో బీసీలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ముందుకు నడిపేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆదరణతో పరికరాలు, ఫెడరేషన్లు, కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికీ ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశాం. కానీ.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్నీ నాశనం చేశాడు. ఆదరణ రద్దు చేశాడు. రిజర్వేషన్లు కుదించాడు. కార్పొరేషన్ వ్యవస్థనే నిర్వీర్యం చేశాడు. తెలుగుదేశం పార్టీ చేసినంత మేలు ఏ పార్టీ కూడా బీసీలకు చేసింది లేదు. అదే సమయంలో జగన్ రెడ్డి చేసినంత ద్రోహం బీసీలకు ఏ ఒక్కరూ చేయలేదు అన్నారు.

బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…
బీసీలను జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందని, ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచారు. నిధులు లేని కార్పొరేషన్లు, అధికారం లేని మంత్రులు, కూర్చోడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్ ఛైర్మన్లతో బీసీలను జగన్ రెడ్డి అణగదొక్కుతున్నారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్మాట్లాడుతూ…

బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడిన అంబేద్కర్, మహాత్మా పూలే స్ఫూర్తితో నందమూరి తారకరామారావు పరిపాలన సాగించారు. అంత వరకు ఓటర్లుగా మాత్రమే ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశ పార్టీదే. 40 ఏళ్ల టీడీపీ చరిత్ర చూసుకుంటే.. బీసీలకు ఎవరేం చేశారో స్పష్టంగా తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుతో లక్షలాది మంది బీసీ యువతని రాజకీయ నాయకులుగా పదవులు కట్టబెట్టిన ఘనత తెలుగుదేశానిదే. 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉండానికి కారణం టిడిపి. బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించడంతో 16,800 మంది బీసీలు రాజకీయ అవకాశాలు కోల్పోయారు. ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నడిపించారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసారు. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చారు.

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. బాబాయ్ పై గొడ్డలి వేటు వేసినట్టే బీసీలకు వెన్నుపోటు పొడిచారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటూ బిల్డప్ ఇచ్చిన జగన్ రెడ్డి బీసీల బ్యాక్ బోన్ విరిచేసాడు. నిధులు, అధికారాలున్న పదవుల్లో తన బంధువుల్ని, సామాజిక వర్గంతో నియమించుకుని నిధులు లేని 56 కార్పొరేషన్లను బీసీలకు ఇచ్చారు. బీసీల నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ రెడ్డి అనేక కుట్రలు చేశాడు. జగన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనను ప్రశ్నిస్తున్నారని టిడిపి బీసీ నేతలైన కింజరాపు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, బీదా రవిచంద్రయాదవ్, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులు పెట్టాడు. 26 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుల్ని హతమార్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే జగన్ రెడ్డి ప్రమాదకరంగా మారాడు. అలాంటి రాక్షసుడితో పోరాడుతున్నపుడు మనలో మనకు ఐక్యత అవసరం.

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు, అన్యాయాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా బీసీ సాధికార కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చెయ్యాలి. మీ కులాలకి జరుగుతున్న అన్యాయం, దాడులపై మీరంతా ఒక్కటై పోరాడాలి. కులాల వారీగా ఎదురవుతున్న సమస్యలపై నివేదికలు సిద్ధం చేసి.. పోరాటం చేద్దాం. బీసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. మావేశంలో 54 సాధికార కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE