– బూతుల్లో పుట్టిపెరిగి, నిత్యం అవివల్లించే వారితోనే పాలనచేస్తున్న జగన్ రెడ్డి బూతులు, భాష గురించి మాట్లాడుతుంటే గురివింద గింజ గుర్తొస్తోంది
– మహిళలు ఎవరి హాయంలో గౌరవంగా తలెత్తుకు తిరిగారో, ఎవరిపాలనలో కన్నీళ్లతో విలపిస్తున్నారో చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధమా?
• ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, కాల్చిచంపాలని, నడిరోడ్డుపై ఉరితీయాలని అన్నప్పుడు జగన్ రెడ్డికి భాష గుర్తులేదా?
• ఇళ్లలో నుంచి బయటకురాని ఆడవారిని తనపేటీఎం బ్యాచ్ తో మానసికంగా వేధించి, వారితో కన్నీళ్లుపెట్టించిన జగన్, బూతుల గురించి రాగాలుతీయడం సిగ్గుచేటు.
– మాజీ మంత్రి పీతలసుజాత
బూతుల్లోపుట్టిపెరిగి, నిత్యం అవి వల్లించే డ్రైనేజీనోళ్లేసుకున్న వారితో పనికిరానిపాలన చేస్తున్న జగన్ రెడ్డి, తానేదోసచ్చీలుడైనట్టు తనను బూతులుతిడుతున్నారంటూ నంగనాచి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి పీతలసుజాత ఎద్దేవా చేశారు.గు రువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే …
“ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏంచేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో జగన్ రెడ్డి ఆలోచించాలి. బూతుల్లో పుట్టిపెరిగి, నిత్యం అవేవల్లించేవారితో పాలనచేస్తున్న జగన్, బూతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ప్రతిపక్షనేతగా పాదయాత్రచేస్తున్నప్పుడు జగన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఏమన్నారో ఆయనకు గుర్తులేదా? చంద్రబాబునాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, చెప్పులు చీపుర్లతో కొట్టాలని, నడిరోడ్డుపై ఉరితీయాలని, కాల్చిపడేయాలని పిచ్చిపిచ్చిగా వాగలేదా? బూతులు, భాష గురించి ముఖ్యమంత్రి నీతివాక్యాలుచెబుతుంటే గురివిందగింజే గుర్తొస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులువాడే పదజాలం, బూతులు, వారివ్యవహారశైలి జగన్ కు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? తెలుగుభాష సిగ్గుతో తలదించుకునేలా దాన్ని బూతులమయం చేసింది ముఖ్యమంత్రి, మంత్రులుకాదా? జగన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడవాళ్లని కూడా ఎంతదారుణంగా అవమానించారో గుర్తులేదా? తనభార్యని ఏదో అన్నారని, మంత్రులకు వార్నింగ్ లు ఇచ్చి, వారి పదవులు పీకేస్తానని హూంకరించిన జగన్ రెడ్డికి, ఇతరఆడవాళ్లను అంటే వారెలా బాధపడతారో తెలియదా?
తన పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా, తనపేటీఎం బ్యాచ్ వారిని మానసికంగా వేధించినా ముఖ్యమంత్రి ఏనాడైనా వారిపక్షాన మాట్లాడాడా? ఇళ్లనుంచి బయటకురాని ఆడవాళ్ల వ్యక్తిత్వాలను హననంచేసింది మీరు, మీ చిల్లర బృందంకాదా జగన్ రెడ్డి? చెరపకురాచెడేవు అన్నట్లుగా జగన్ రెడ్డి, అతనిగ్యాంగ్ వాడిన బూతుపురాణం, ఇప్పుడు వారికే తగులుతోంది. డ్రైనేజీలాంటి నోళ్లతో, దారుణమైన వెకిలిచేష్టలతో ఇంట్లోని ఆడవాళ్లు కూడా అసహ్యించుకునే పరిస్థితి వైసీపీనేతలు తెచ్చుకున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ దాటి జగన్ బయటకువస్తే, మహిళలకు ఎవరిహాయాంలో గౌరవం లభించిందో, ఎవరి పాలనలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందో ఆయనతో చర్చకు తాము సిద్ధం. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించి, వారికి గుర్తింపునిచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ అయితే, ఆడబిడ్డలకుఅన్నగా, వారికష్టసుఖాల్లో తోడునీడగా నిలిచింది చంద్రబాబుగారు. తెలుగుదేశంపార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ మహిళల్ని కించపరిచి, వారితో కన్నీరు పెట్టించిందిలేదు. తననియోజకవర్గంలో తనపని అయిపోతుందని రోజా తెలుసుకుంటే మంచిది. విశాఖ విమానాశ్రయంలోఆమె హావభావాలు, వెకిలివేషాలు ఎలా ఉన్నాయో చూశాం” అని సుజాత దెప్పిపొడిచారు.