ఎంపీ విజయసాయిరెడ్డి
2024 ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడికీ లేదని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు..పలు అంశాలపై యన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం అన్నారు. అయితే పరాజితులు, ఒకప్పటి రౌడీ షీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగులిస్తే వీధి కుక్కలు కూడా భయపడవని పరోక్షంగా టిడిపికి చురకలు అంటించారు తెలుగుదేశం అనుకుల మీడియా.
ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ సొంత కథనాలు ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. మరి ఇటీవల ఇండియా టుడే టీవీ సర్వే మాత్రమే అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందని ఎద్దేవా చేశారు.. టిడిపి గెలుస్తుందని చెబితేనే ఒరిజినల్, లేకపోతే ఫేకా? అని తెలుగుదేశం అనుకుల మీడియాను ప్రశ్నించారు.
ప్రజా ప్రయోజనాలు,సంక్షేమమే లక్ష్యంగా వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు పనిచేయాలని ఆయన తెలిపారు..పై మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాలు,కార్యక్రమాలు అందింస్తూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలన్నారు.