Suryaa.co.in

Telangana

కేసీఆర్ లాంటి బట్టేబాజ్ సీఎంను దేశ చరిత్రలో ఎవ్వరిని చూడలేదు

– ఈ మొనగాడు, తీస్ మార్ ఖాన్ ఇప్పుడెందుకు కేంద్రానికి లేఖ రాసిండు?
– క్వింటాలుకు 1960 రూపాయలు చొప్పున ఎమ్మెస్పీ కూడా కేంద్రమే చెల్లిస్తది

ఆలంపూర్ మియోజకవర్గంలోని బోరవెల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధి ఎన్. వి.సుభాష్, గద్వాల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, ఐటీ విభాగం కన్వీనర్ వెంకట రమణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….

సీఎం కేసీఆర్ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సహా అందరిని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వడ్ల కొనుగోలు డ్రామాలాడి రైతులను అరిగోస పెట్టినడు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసింది కెసీఆర్… మెడ మీద కత్తి పెడితే రాసిచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు.

ఇంతవరకు 2020-21 సంవత్సరానికి ఇవ్వాల్సిన 9 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇయ్యలేదు.ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిరోజు ఆర్టీసీ చార్జీలు పెంచుతూ జనాన్ని పీడిస్తుండు. రైతుల కోసం గంటసేపు కూడా ధర్నా కూడా చేయలేని అసమర్థుడు కేసీఆర్.

కేసీఆర్ లాంటి బట్టేబాజ్ సీఎంను దేశ చరిత్రలో ఎవ్వరిని చూడలేదు. లేని సమస్యను స్రుష్టించి రాజకీయం చేయాలనుకుంటడు. వడ్ల కొనుగోలు వ్యవహారమే దీనికి సాక్ష్యం. మీరే చెప్పండి… యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో సీఎం సాధించేదేమిటి? మేం మొదటి నుండి చెబుతూనే ఉన్నం యాసంగి పంటనంతా కొనేది కేంద్రమే. ఎంత ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నమని చెబుతూనే ఉన్నం కదా…

కానీ కేసీఆర్ ఏం చేసిండు… నిరుద్యోగుల కోపాన్ని, కరెంట్ ఛార్జీల పెంపు పై జనంలో ఉన్న ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకు వడ్ల సమస్యకు తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకున్నడు.

కేంద్రం యాసంగి పంటను కొంటలేని గోలగోల చేసిండు. కొనకపోతే ఢిల్లీలో వడ్లన్నీ పారబోస్తనని చెప్పిండు. మళ్లా ఆయనే కేంద్రం బియ్యం కొంటలేదని గాయిగాయి చేసిండు. ఏనాడు ఫాంహౌజ్ దాటనోడు బయటకొచ్చి బీజేపీని బదనాం చేసేందుకు లంగా మాటలన్నీ చెప్పిండు. గల్లీ నుండి ఢిల్లీదాకా పోయి ధర్నాలు చేసిండు. కానీ ఏమైంది? కేంద్రం కొంటలేదు కాబట్టి మేమే కొంటామని చెప్పిండు. 3, 4 వేల కోట్లు ఖర్చయినా భరిస్తామని గప్పాలు కొట్టిండు.

కానీ ఏం చేసిండో తెలుసా….. పండించిన పంటనంతా కేంద్రమే కొనాలని కేంద్రానికి లేఖ రాసిండు. ఇదిగో లేఖ (చూపిస్తూ…). మూడు రోజుల కింద అంటే ఏప్రిల్ 13న రాసిన లేఖ ఇది.యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని, బియ్యం పట్టిస్తే 40. 22 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ వస్తాయి. అవన్నీ కేంద్రానికి పంపిస్తామని లేఖ రాసిండు.

మొత్తం నేనే కొంటున్నా… కేంద్రంతో పనిలేదని చెప్పిన ఈ మొనగాడు, తీస్ మార్ ఖాన్ ఇప్పుడెందుకు కేంద్రానికి లేఖ రాసిండు? ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో మీటింగ్ పెట్టి ఏ రాష్ట్రం ఎంత బియ్యం పంపుతుందో వివరాలివ్వాలని కోరితే… ఆనాడు అన్ని రాష్ట్రాలు వివరాలిచ్చినయ్. కానీ ఈ మోతెబరి మాత్రం ఆ వివరాలే ఇవ్వలేదు. మేం పంపేది లేదని కథలు పడ్డడు.
మరి ఇప్పుడెందుకు లేఖ రాసినట్లు? మొత్తం యాసంగి వడ్లన్నీ బియ్యం పట్టించి కేంద్రానికి పంపిస్తాం… తీసుకోవాలని లేఖ ఎందుకు రాసిండు. అయినా ఈ సీఎంకు సిగ్గు కూడా లేనట్లుంది. పోనీ సోయి కూడా లేదేమో. 13న లేఖ రాస్తే… 14న కేంద్రానికి అందింది. ఆరోజు సెలవు. నిన్న, ఇయాళ, రేపు కూడా సెలవు. అధికారులతో సమావేశమై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే వర్కింగ్ డే రోజు లేఖ పంపాలనే సోయి కూడా లేకపోతే ఎట్లా?

నెల రోజుల నుండి మొత్తుకుంటుంటే ఎందుకు రాయలేదు? పైగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను గోల్ మాల్ అంటూ దూషిస్తారా?ఇప్పటికే యాసంగి వడ్ల కొనుగోల విషయంలో రైతులను అరిగోస పెట్టి ఉసురు పోసుకున్నవ్. నువ్వు వడ్లు కొననని చెప్పే సరికి అడ్డికి పావుశేరుకు బ్రోకర్లకు అమ్ముకుని నష్టపోయిండ్రు.తొందరగా నిర్ణయం తీసుకుని చేసిన తప్పు సరిదిద్దుకోవాలనే సోయి కూడా లేకుండా పాలన చేస్తానంటే ఎట్లా?

పైగా కేంద్రాన్ని బాదనాం చేసేందుకు రక్తం మరిగిపోతుందని రెచ్చగొడుతున్నాడు. కేసీఆర్ తిడుతున్న మౌనంగా ఉన్న కేబినెట్ మంత్రులు చేతకాని దద్దమ్మలు. నేను వాళ్ళ స్థానంలో ఉంటే ఈపాటికి రాజీనామా చేసేటోడిని. నీకు చేతకాకుంటే సీఎం పదవి నుండి డిగిపో కేసీఆర్..

నేను మళ్లా చెబుతున్న….కేంద్రం బరాబర్ కొంటది. ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పినం. క్వింటాలుకు 1960 రూపాయలు చొప్పున ఎమ్మెస్పీ కూడా కేంద్రమే చెల్లిస్తది.

కానీ రైతులకు నా విజ్ఝప్తి ఒక్కటే… ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు మాత్రం అమ్ముకోవద్దు. ఎక్కువ ధర వస్తే మాత్రం అమ్ముకోండి. మేం ఎమ్మెస్పీ ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నం. కేంద్రం ఇప్పటికే 97 వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుల కోసం ఎన్ని వేలకోట్లయినా ఖర్చు పెట్టి కొనేందుకు సిద్ధంగా ఉంది. అట్లాగే సీఎం చేసిన నిర్వాకంవల్ల క్వింటాలకు వెయ్యి, 1100 రూపాయలకే వడ్లను అమ్మి నష్టపోయిన రైతులకు కేసీఆరే పరిహారం ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేస్తున్నా…

మీడియా ప్రశ్నకు… పాలమూరు పచ్చగా ఉందా? మీరే చెప్పండి. తుపాకీ రాముడి మాటలు నమ్మేదెవరు?

ఈ జిల్లా మంత్రి అసహనంతో వున్నాడు.ఏం మాట్లాడితున్నాడో అర్థం కావడం లేదు.. ఖమ్మం టౌన్ లో సూసైడ్ చేసుకున్న సాయి గణేష్ చావుకు జిల్లా మంత్రి, పోలీసులే కారణం. గణేష్ కుటుంబాన్ని బీజేపీ అడ్డుకుంటుంది.

 

LEAVE A RESPONSE