-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాజధాని మార్చడం పై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కేలేదని రాజ్యసభ సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పకనే చెప్పారని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. “మేము ఏదో పిచ్చి పని చేశాం కాబట్టి, పార్లమెంట్ ద్వారా ఆ హక్కును ప్రసాదించమని ప్రైవేటు మెంబర్ బిల్లు”ను ప్రవేశపెడుతున్నామని చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… తాను ఇదే విషయమై రెండేళ్ల క్రితమే చెట్టు కింద రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుకునే సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు. రాజధానిని ప్రతిపాదించడానికి మీరెవరు అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, తాను ఇదే విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎవరైనా తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టిన ఇతర ప్రాంతానికి వెళ్తే వెళ్ళవచ్చు కానీ… అమరావతిని రాజధానిగా కదిలించలేరని చెప్పారు. పార్లమెంటులో తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారని తెలిపారు.
పార్లమెంటు వ్యవస్థ మనుగడ లోకి వచ్చిన నాటి నుంచి, కేవలం రెండే రెండు ప్రైవేటు మెంబర్ బిల్లులు ఆమోదం పొందాయని వెల్లడించారు. రాజధానులను ఏర్పాటు చేసుకోవడానికి తమ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించాలని విజయ సాయి ప్రైవేటు మెంబర్ బిల్లులో కోరారని తెలిపారు. రాజధాని ఏర్పాటుల విషయంలో రాష్ట్రానికి స్వేచ్ఛ ఉండాలన్న విజయసాయిరెడ్డి, అది ఒకటైన అంతకన్నా ఎక్కువైన అని కోరారని వివరించారు.. ఒకసారి పార్లమెంటుకు హక్కులు దాఖలు పరిచిన తర్వాత, రాజధాని మార్చడం అన్నది కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తమ ప్రభుత్వం ఏర్పడిందని భ్రమ లో విజయ్ సాయి రెడ్డి పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టారని ఎద్దే దేవా చేశారు. అమరావతి రైతులతోపాటు, రాష్ట్రంలో 99 శాతం మంది ఒకటే రాజధానిని కోరుకుంటున్నారని, పార్లమెంట్లో సాయి రెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టినందుకు అభినందనలతో పాటు, అమరావతి రైతుల తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. అమరావతి రైతుల నుంచి భూసేకరణ పై గతంలో ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆవేదన భరితంగా గద్గద స్వరంతో మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ఒకవేళ జైలులో ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని విజయసాయి మరొక ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారని రఘురామ తెలిపారు. ఎంపీలకే కాకుండా, ఎమ్మెల్యేల కూడా ఈ నిబంధన వర్తించాలని ఆయన కోరారని తెలిపారు. ఒకటి అమరావతి రైతుల ప్రయోజనాల కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి, రెండవది తన స్వప్రయోజనాల కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు.
ఫలానాది కావాలన్నా ఊసే లేదు
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా… తమ రాష్ట్రానికి ఫలానాది కావాలి అని కోరలేదని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా అడుగుతారని భావించామని, పోలవరం ప్రాజెక్టు ఊసే ఎత్తలేదని విర్చుకోపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 11 వేల రైతు భరోసా కేంద్రాలను నిర్మించామని, రాష్ట్ర జిడిపి రైతులపైనే ఆధారపడిందని పేర్కొనడం ద్వారా, రాష్ట్రంలో పరిశ్రమల ఊసే లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో రైతులకు వైయస్సార్ భరోసా పథకంతో పాటు, పీఎం కిసాన్ యువజన ద్వారా నిధులు కూడా ఇస్తున్నామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీఎం కిసాన్ యోజన కింద నిధులను రైతులకు మంజూరు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమని గుర్తు చేశారు.
ఇక రాష్ట్రంలో గత ఐదు ఆరు నెలల నుంచి, డబ్బులు అందడం లేదని, క్రాఫ్ హాలిడే పాటిస్తామని రైతులు గోల గోల చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏమన్నార్ జీఎస్ పథకం ద్వారా 90 శాతం నిధులను కేటాయిస్తున్ననది, అయినా అంతా తానే చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నారని రఘురామకృష్ణం రాజు విరుచుకు పడ్డారు. ఇక విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పడం ఆస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో 5900 స్కూళ్లను మూసివేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి, దాతల సహకారంతో ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించడం ప్రభుత్వం విధి అని పరుగురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో ఆరు వీళ్ళ స్కూళ్ళను ఎత్తివేయడంతో పాటు, పదివేల ఉపాధ్యాయుల ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి మంగళం పాడే పని లో ఉన్నారని ధ్వజమెత్తారు. మాతృభాషలోని విద్యా బోధన చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, అటువంటి అవకాశమే లేకుండా, ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే పనిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదన్నారు. ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. జ్ఞానం వేరు, భాష వేరన్న రఘురామకృష్ణంరాజు, ఏ భాషలోనైనా జ్ఞానం సంపాదించవచ్చు చెప్పారు.. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తెలుగు , ఉర్దూ భాషలలో చదువు కుని, 14 భాషలలో అనర్గళంగా మాట్లాడుతూ, రాయడం నేర్చుకున్నారని తెలిపారు. పబ్లిక్ స్కూల్లో చదివిన మనకు ఎన్ని భాషలు వచ్చు అంటూ ఎద్దేవా చేశారు.
వాళ్లకు అసలు క్రమశిక్షణ లేదు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీలు… మాజీ ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ, కుటుంబ సభ్యుల మాదిరిగా కలివిడిగా ఉండడం చూస్తుంటే, వాళ్లకు అసలు క్రమశిక్షణ లేదని అనిపిస్తుందన్నారు. అదే తమ పార్టీలో అయితే ముఖ్యమంత్రిని కలవడానికి క్యూ లో నిలబడడమే కాకుండా , బెరుకు గా వినతి పత్రాలను అందజేస్తారని… అది తమ పార్టీ క్రమశిక్షణ అంటూ అపహాస్యం చేశారు.
ఆ వీడియోలో ఉన్నది మాధవ్ కాదని తేల్చేయండి
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తప్పు చేస్తే మొదటిసారి రెండేళ్లు, రెండవసారి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష వేస్తామని గతంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, నగ్న వీడియో ద్వారా మహిళలు వేదికల గురి చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవ్ పై చర్యలకు వెనుకాడడం పట్ల రఘురామకృష్ణంరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీడియోలో ఉన్నది మాధవ్ కాదు అని తేల్చేయండి, మాధవ్ నిర్దోషి అని చెబితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఒక మంత్రి వీడియో కూడా వెలుగులోకి రానున్నట్లు తెలిసిందని చెప్పారు.