-నిఘా విభాగం అధికారులు నిద్ర పోతున్నారా?
-నైతికత ఉంటే డీజీపీ రాజీనామా చేయాలి
– ఇది మరో కోడి కత్తి నాటకం
-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో విపక్షాలను నీడలా వేటాది వేధిస్తోన్న నిఘా విభాగం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని రాళ్ల దాడి నుంచి ఎందుకు కాపాడలేపోయిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యమం త్రికే భద్రత ఇవ్వలేని దిక్కులేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉందా? లేక ఇందు లో ప్రచారం కోసం పన్నిన కుయుక్తులైమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉందన్నారు. డీజీపీకి ఏ మాత్రం నైతికత ఉన్న తను రాజీనామా చేయడంతో పాటు అంతకు ముందే ఈ ఘటనకు ఆస్కారం ఇచ్చిన ప్రతి పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన నరసరా వుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్నదేవరాయలుతో కలిసి స్థానికంగా యడ్లపాడు మండలం జగ్గాపురంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు. వైకాపా నేతలు జరిగిన బురదజల్లే ప్రయత్నాలు మాను కుని నిజమేంటో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. భారతి ప్రవేశం తర్వాతనే ఇక్కడ రాయి దాడి నాటకం మొదలైందన్నారు. ఆమె వచ్చిన తర్వాతనే ఘటన జరగడం ఏంటని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే పోయినసారి కోడికత్తి, బాబాయి హత్య.. ఇప్పుడేమో గులకరాయి నాటకమాడుతున్నారని మండిపడ్డారు.
పోలీసులు నిద్రపోతున్నారా.. సీఎంకు భద్రత కల్పించాల్సిన ఉన్నతాధికారులు, నిఘావిభాగం ఏమయ్యారని ప్రశ్నించారు. అనంతరం స్థానిక నాయకులు, శ్రేణులకు ఎన్నికల శంఖారావం, సూపర్ సిక్స్ పథకాలపై దిశానిర్దేశం చేశారు. 1999లో తనకు ఏకపక్షంగా ఓట్లేసిన గ్రామం జగ్గాపురం అని, జగ్గాపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. జగన్‌రెడ్డి బటన్ నొక్కుడు మొత్తం పచ్చి మోసమన్నారు. పేదల పేరు చెప్పి ఈ బటన్ నొక్కుడు డబ్బులను దోచు కున్నా రని ఆరోపించారు. సంవత్సరానికి రూ.30 వేల కోట్లు చొప్పున మద్యంపై దోపిడీ చేశారని.. అయిదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లను ప్రజల రక్తమాంసాల నుంచి పిండుకున్నారని మండిపడ్డారు. అనంతరం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.