Home » డీజీపీ ఏం పీకుతున్నారు?

డీజీపీ ఏం పీకుతున్నారు?

– ఓటమి భయంతో జగన్ రెడ్డి కొత్త డ్రామా
• 200 మీటర్ల దూరం నుంచి చిన్న రాయితో బౌలింగ్ చేస్తే రెండు కళ్లు, ఒక కాలుకి దెబ్బతగలడమా?
• జగన్ రెడ్డిపై దాడి సినిమాకు స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఐ ప్యాక్ టీమ్ దే
– హీరో హాఫ్ టికెట్ జగన్ రెడ్డి, హీరోయిన్ భారతీరెడ్డి, క్రియేటివ్ డైరెక్షన్ సజ్జల భార్గవ్ రెడ్డి, విలన్ ఔతు శ్రీధర్ రెడ్డి . ఇక ప్రొడ్యూసర్ పొట్టిసారాయి విజయసాయి రెడ్డి
• 4 రోజుల క్రితం రాష్ట్రంలో సంచలన ఘటనలు జరగబోతున్నాయని వైసీపీ నేత శ్రీధర్ రెడ్డి ట్వీట్ దేనికి సంకేతం?
• ఘటన జరిగిన వెంటనే వాలంటర్లీకు సమాచారం ఎలా వెళ్లింది?
• వైఎస్ షర్మిల, సునీత, భాస్కర్ రెడ్డికి ప్రాణహాని ఉంది
– ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు
– చంద్రబాబు మారాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపాడు. విజయవాడలో జరిగిన దాడి సినిమాకు స్క్రీన్ ప్లే, డైరెక్టర్ ఐ ప్యాక్ టీమ్ దే. ఈ సినిమాకు హీరో హాఫ్ టికెట్ జగన్ రెడ్డి, హీరోయిన్ భారతీరెడ్డి, క్రియేటివ్ డైరెక్షన్ సజ్జల భార్గవ్ రెడ్డి, విలన్ ఔతు శ్రీధర్ రెడ్డి . ఇక ప్రొడ్యూసర్ పొట్టిసారాయి విజయసాయి రెడ్డి. ఎందుకంటే జగన్ రెడ్డి దోచేసి లిక్కర్ సొమ్ము మొత్తం విజయసాయి రెడ్డి దగ్గరే ఉంది. ఆ డబ్బుతోనే ఈ సినిమా తీశారు.

వెల్లంపల్లి శ్రీవివాస్, కేశినేని నాని, రహ్మతుల్లా, దేవినేని అవినాష్ ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్లు. అంతా పక్కాగా స్కెచ్ ప్రకారం ప్లాన్ చేశారు కానీ వైసీపీ నేత ఔతు శ్రీధర్ రెడ్డి వల్ల దొరికిపోయారు. రాష్ట్రంలో సంచలన సంఘటలు జరిగే అవకాశం ఉందని, అవి ఎన్నికల మూడ్ నే మార్చేస్తాయని నాలుగు రోజుల క్రితం వైసీపీ నేత ఔతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ చేశాడు. అతను ముందుగా చెప్పినట్టే కోడికత్తి 2, బెజవాడ రాయితో డ్రామా రక్తి కట్టించారు.

హీరోయిన్ భారతక్క నడిపే అవినీతి సాక్షి మరో ముందడుగు వేసేసింది. సీఎం జగన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని సాక్షిలో బ్యానర్ వార్త రాశారు. చిన్న రాయితో హత్యాయత్నం చేసినట్టు , ఫోటో కూడా బాగా వేయించారు.

డ్రామా వెనుక పోలీసుల పాత్ర
ముందుగా వేసిన స్కెచ్ ప్రకారం రాత్రి 7 గంటలకు కరెంటు పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభ జరుగుతున్నా డ్రోన్లు ఎక్కడా లేవు. అదే లోకేష్ బాబు యువగళం యాత్రలో మాత్రం 20 డ్రోన్లు తిరుగుతుంటాయి. జగన్ రెడ్డి మీటింగ్ లో మాత్రం డ్రోన్ విజువల్స్ లేవు. ఈ డ్రామాలో పోలీసుల పాత్ర కూడా ఉంది. 3000 మంది పోలీసులు చుట్టూ కమ్మేసి కవర్ చేశారు.

ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరుగుతుంది, భద్రత ఇవ్వండని డీజీపీ సహా పలువురు పోలీసు అధికారులకు మేము మొరబెట్టుకున్నారు. ఇతర దేశాల ఇంటెలిజెన్స్ కూడా జగన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉన్నట్టు తమకు సమాచారం ఇచ్చినట్టు పోలీసులు చెప్పారు. మరి ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం పీకుతున్నారు? అంటే ఈ స్కెచ్ లో మీరూ భాగస్వాములయ్యారా?

ఒక రాయి రెండు కళ్లు, ఒక కాలిపై గాయం చేసిందా?
రెండంతుస్తుల భవనం నుంచి రాయి వేస్తే జగన్ రెడ్డికి తగిలి తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకి తగిలి మళ్లీ జగన్ రెడ్డి కాలికి దెబ్బ తగిలింది. అంటే రెండు కళ్లు, ఒక కాలిపై రాయి తగిలింది.. ఒక రాయి మూడు స్థానాల దగ్గర దెబ్బతీసిందని ప్రజలు గుర్తుంచుకోవాలి. జగన్ రెడ్డి అండ్ కో ఇంత కష్టపడి స్కెచ్ వేస్తే ఒక్క ట్వీట్ తో వైసీపీ నేత శ్రీధర్ రెడ్డి నాశనం చేసేశాడు.

నిన్న మా భారతక్క బంగారు ….బాయ్ అని టాటా చెప్పింది. వెంటనే మా జగనన్నకు దెబ్బతగిలింది. 2018లో కోడికత్తి డ్రామా ఫెయిల్ కావడంతో చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం వివేకాను బలి చేశారని సొంత చెల్లిలే చెప్పింది. విజయవాడలో జగన్ రెడ్డి తలకు గాయం మొత్తం డ్రామానే అని ప్రజలకు అర్ధమైంది. నెక్ట్స్ వికెట్ ఎవరు ? వైఎస్ షర్మిల, సునీత, వైఎస్ భాస్కర్ రెడ్డికి ప్రాణహాని ఉంది. దానికీ చంద్రబాబే కారణమని అపవాదు తోసేయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ముగ్గురూ మే 13 వరకూ దూరప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలి.

టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటిపై వైసీపీ గూండాలు దాడి చేశారు. రాడ్డుతో కన్ను పొడిచారు. దాన్ని హత్యాయత్నం అంటారు కానీ చిన్న రాయి తగిలితే హత్యాయత్నం కాదని భారతి రెడ్డి గుర్తించాలి. సాధారణంగా చిన్న రాయి తగిలితే బ్యాండేజ్ వేస్తారు. కానీ ఆస్పత్రిలో జగన్ రెడ్డి చుట్టూ ఉన్న డాక్టర్ల బృందాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? ఏదో గుండె మార్పిడి చికిత్సకు వచ్చినట్టు అంతమంది ఉన్నారేంటి? సజ్జల భార్గవ్ రెడ్డి జీనియస్. క్రియేటివ్ డాక్టర్. బాగా రక్తికట్టించాడు డ్రామాను. వెల్లంపల్లి శ్రీనివాస్ మామూలుగా నటించలేదు.

వాయు వేగంతో వాలంటీర్లకు సమాచారం:
జగన్ రెడ్డిపై రాయితో చేసిన హత్యయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందంటారేమో. చంద్రబాబు లాంటి వ్యక్తి కత్తి పడితే జగన్ రెడ్డిలాంటి వారు ఏమవుతారో? అహింసా మార్గం, ప్రజాస్వామ్యంలో వెళ్లమని చంద్రబాబు చెప్పడం వల్ల టీడీపీ కార్యకర్తలు నష్టపోతున్నారని పెద్దాయన గ్రహించాలి. జగన్ రెడ్డిపై రాయితో దాడి జరిగినట్టు నిన్న రాత్రి 8.15 కి వాలంటీర్లకు సమాచారం ఎలా వెళ్లింది? జగన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఎందుకు చెప్పారు? సమాచారం ఎలా చేరవేశారు? ఇదంతా పక్కా వ్యూహంతో చేసిన కుట్ర అని అర్ధమవుతోంది.

8.10కి ఘటన జరిగితే 8.14 గంటలకు జగన్ పై హత్యాయత్నం అని సోషల్ మీడియాలో హడావుడి చేసేశారు. గ్రాఫిక్ ప్లేట్లు సహా ముందే రెడీ చేసుకోవడంతోనే అంత వేగంగా సోషల్ మీడియాలో వదిలారు. వైసీపీ గూండాలు ఎంతకైనా దిగజారతారు కాబట్టి చంద్రబాబు మారాలి. ఎదురుదాడి చేయకపోతే ఏమైపోతామో అని భయమేస్తోంది. మనం ఎన్ని రోజులు దెబ్బలు తినాలి? టీడీపీ కార్యకర్తలు తిరగబడితే వైసీపీ వాళ్లు తట్టుకోలేరు.

Leave a Reply