Suryaa.co.in

Telangana

దక్షిణాదిలో ఒక సీటు తగ్గదు

-భట్టి విక్రమార్క, జానారెడ్డి నిర్వహించే సమావేశం ప్రభుత్వానిదా? పార్టీదా?
– పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఇచ్చిన ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు సరిగా లేదు.
దక్షిణాదిలో ఒక్క సీటు కూడా తగ్గదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేయడం జరిగింది.

డీఎంకే పార్టీ పైన ముఖ్యమంత్రి స్టాలిన్ పైన అవినీతి ఆరోపణలు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు వచ్చే సంవత్సరం తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి.. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, ఎన్నికల్లో ప్రజల దృష్టి మళ్లించి లబ్ధి పొందాలని దురాలోచన.

డిలిమిటేషన్ తెరమీదికి తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రో రేటా అనుగుణంగా ఒకవేళ పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు అని స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ విఫలమయ్యారు, అవినీతికి తెర లేపారు. కాబట్టి తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బిజెపిని ఆదరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల్లో అసంతృప్తి, అసహనం, ఆగ్రహం పెరిగింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి, కాలం వెళ్లబుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న తెలంగాణ పట్ల గాని దక్షిణాదిపట్ల గాని అభివృద్ధి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు.

2026లో రాజ్యాంగ సవరణ తరువాత చట్టం రూపొందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పునర్విభజనపై ఎలాంటి ప్రకటన కానీ దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించలేదనేది ముందుగా తెలుసుకోవాలి. దీనిపైన పార్లమెంటులో చర్చ జరుగుతుంది అనేది మొదటగా ముఖ్యమంత్రి గ్రహించాలి. లోక్సభలో, రాజ్యసభలో విధి విధానాలు రూపొందిస్తున్న సమయంలో తమ అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ చెప్పవచ్చు.

భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతున్నది అని మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు విధివిధానాలు రూపొందించిన తర్వాత దానిలోటుపాట్లను ప్రజలకు వివరించాలి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అదే విధంగా ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దురుద్దేశాన్ని తెలియజేస్తుంది.

దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకు నష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి విక్రమార్క మరియు జానారెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసేది ప్రభుత్వ కమిటీ నా? లేక కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న కమిటీ నా? ముందు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తేల్చాలి.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అందుకోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనేది ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. బాధ్యతల గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రజా సమస్యలు రాజ్యాంగపరమైన విధి విధానాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్ర ప్రభుత్వం లో ప్రతినిధిగా జి కిషన్ రెడ్డి ఉన్నందున బాధ్యత తీసుకొని డీలిమిటేషన్ పై మాట్లాడాలి అని మాట్లాడడం సమర్థనీయం కాదు. . హక్కులు బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటివి దానితోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వి అధికారులను, విషయ పరిజ్ఞానం ఉన్న వారిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటే మంచిది.

రాజ్యాంగం పట్ల పరిపాలన పట్ల ఇంకా అర్థం కానట్లు తెలుస్తుంది. లేదా అర్థం కానట్టు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారా? స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని అభినందిస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే సమర్థిస్తున్నట్లే. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కాపాడడానికి అందరూ రావాలి అని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మీడియా సమావేశంలో స్టాలిన్ ఏర్పాటుచేసిన సమావేశానికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.

దక్షిణాది ఉత్తరాది అని విభజించాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది . దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగేలా కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం.

LEAVE A RESPONSE