ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు
రాబందుల్లా పీక్కు తింటుంటే..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే లంచాలకు మరిగి అన్యాయం చేస్తుంటే..
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాదికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే..
దిక్కుతోచక అమాయక ప్రజలు..
తేనె పూసిన కత్తులకు బలైపోతున్నారు
ఇంకెన్నడు మారేనో కదా నా దేశం..
అవినీతిని అంతమొందించాలంటే అహింసే మార్గమా
సినీమాలో లాగా ఒక భారతీయుడో…
ఒక అపరిచితుడో….లేక ఒక ఠాగూరో రావాలా..
మంచి,మానవత్వం మరిచి సాటి మనిషి రక్తాన్ని జుర్రుకు త్రాగుతుంటే….
రక్తమే లేని అ బక్క పాణాలు విలవిలాడుతుంటే…
అయ్యో దేవుడా అని లేని దేవున్ని వేడుకుంటుంటే..
వెర్రి నవ్వులు నవ్వుతూ పైశాచికానందాన్ని పొందౌతూ..
శవాల మీద బోంగులు ఏరుకుతినే నీతి మాలిన వెదవల్లారా…
ఏమి సాధిద్దామని ఈ పాడు పనులు..
అవినీతిగా..అక్రమంగా…అధర్మంగా..అన్యాయంగా..
మీరు సంపాదించేది సచ్చాక..
బొందలో పెట్టుకుపోతారా..?
వెంట పట్టుకుపోతారా..?
ఇకనైనా కళ్ళు తెరవండి…
మంచికోసం బ్రతికండి..
మనిషిగా బ్రతకండి…
(ఇది కేవలం చెడ్డ వారిని ఉద్దేశించి మొత్తమే..)