Suryaa.co.in

Political News

కేసీఆర్-మమతా కాదు.. కేజ్రీవాలే ప్రత్యామ్నాయమా?

– కాంగ్రెస్ పని ఖతం
– బీజేపీకి పోటీ కేజ్రీవాలేనా?

దేశంలో బీజేపీకి, మోదీకి ఏకైక ప్రత్యామ్నాయ నేత తెలంగాణ సీఎం కేసీఆరే..
అవును.. ఆయనయితే అందరినీ కూడగడతారు. అందరూ ఆయనను నమ్ముతారు.
కాదు.. ఆయనను ఉత్తరాది పార్టీలు నమ్మవు. పైగా.. ఆయన కలిసిన సీఎంలు వారి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తున్నారు. కాబట్టి వారంతా కేసీఆర్ వెంట రాకపోవచ్చు.
మోదీకి మమతా దీదీ ఒక్కరే ప్రత్యామ్నాయం. ఆమెకు బీజేపీని ఎదుర్కొనే శక్తి ఉంది.ఇవీ నిన్నటి వరకూ
amit-shah-mamata జాతీయ స్థాయిలో వినిపించిన మాటలు.

కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కాదు.. మమతా కాదు.. మరెవరూ కాదు. ఒక్క
kcr-pawar-family కేజ్రీవాలే బీజేపీకి ప్రత్యామ్నాయం అనే కొత్త చర్చకు తెరలేచింది. కారణం.. దేశ రాజధానిలో బీజేపీని ముచ్చటగా మూడుసార్లు ఓడించి, ఇప్పుడు కొత్తగా పంజాబ్‌లో కూడా అధికార ఖాతా తెరిచారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని తేలిపోయింది. దేశంలో బీజేపీకి ఎదురులేదని తేలిపోయింది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెరపైకి వస్తోంది.ఇప్పటికే బీజేపీని దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో వరుసగా మూడుసార్లు ఓడించింది ఆప్ పార్టీ. ఇక పంజాబ్ లోనూ కాంగ్రెస్ ను చిత్తు చేసి ఏకంగా రెండు రాష్ట్రాల్లో అధికారం సంపాదించింది. గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను చేజిక్కించుకుంది.

పంజాబ్ లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా ఫలితాల్లో అధికారం వైపు ఆప్ దూసుకుపోతోంది. మొత్తం పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 59 సీట్లు అవసరం కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 89 స్థానాల్లో ఆధిక్యంతో అధికారంలోకి రాబోతోంది.మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి దూసుకుపోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లలోనే గెలిచి బొక్క బోర్లా పడింది.

ఒక ప్రాంతీయ పార్టీ అయిన ఆప్ .. రెండు జాతీయపార్టీలు కాంగ్రెస్ బీజేపీలను చిత్తుగా ఓడించి ఓ రాష్ట్రంలో అధికారం కొల్లగొట్టడం ఇదే ప్రథమంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆప్ అధినేత కేజ్రీవాల్ ఏకంగా జాతీయనేతగా ఈ దెబ్బకు ఎదగబోతున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీకే పరిమితమైన ఆప్.. తాజాగా పంజాబ్ లో కూడా సత్తా చాటడం విశేషం.

పంజాబ్ లో అధికారాన్ని సొంతం చేసుకోవడం ద్వారా దేశ ప్రజానీకాన్ని కేజ్రీవాల్ తనవైపు ఆకర్షించగలిగారు. పంజాబ్ లో కేజ్రీవాల్ పార్టీ సత్తా చాటడంతో దేశ రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం చుట్టే అవకావాలున్నాయి.

ఇంతవరకూ బీజేపీకి ప్రత్యామ్మాయంగా పశ్చిమ బెంగాల్ తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, కేసీఆర్ లు తమను తాము ప్రకటించుకున్నారు.కానీ ప్రాంతీయపార్టీ అధినేతగా మరో రాష్ట్రంలో ప్రజాదర పొందిన కేజ్రీవాల్ ఇప్పుడు మోడీకి ప్రత్యామ్మాయ నేతగా దేశం ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ను కాదని మరో జాతీయ పార్టీగా ఆప్ ను ప్రజలు చూస్తున్నారు.

LEAVE A RESPONSE