Suryaa.co.in

Andhra Pradesh

పేరుకు పాదయాత్ర… చేసింది కారు యాత్ర!

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

ఈయన కార్‌ నెంబర్‌ ఏపీ 16 ఈఎఫ్‌ 4869. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని నాగావళి హోటల్‌లో ఉన్నారు.అక్కడ గౌతు శిరీష పేరు మీద బుక్‌ చేసిన రూమ్‌లో ఈ మహా పాదయాత్రికుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోషల్‌ మీడియాలో మాత్రం టీడీపీ ఈ వ్యక్తిని ఒక అమరావతి వీరుడిగా, శూరుడిగా చూపిస్తోంది. ఈయన పేరు గద్దే తిరుపతిరావు. ఆదివారం ఉదయం ఈయన ఈ హోటల్‌ నుంచి అరసవెల్లి సూర్య దేవాలయం వరకు పాదయాత్ర చేస్తారు.

ఈయనకు తెలుగుదేశం శ్రేణులు మద్దతు పలుకుతాయి. అహో ఈ ఒక్కడే అక్కడి నుంచి ఇక్కడికి ఎవరికీ కనిపించకుండా కాళ్లతోనే నడిచి వచ్చాడని రేపు హారతులు పట్టడం, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ చేయబోతున్నారు.ఇక్కడే అందరికీ ఒక డౌట్‌ వస్తుంది. పాదయాత్ర అంటే పాదాలతోనే చేస్తారా? లేక కారులో పాదాలు పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా, ఎక్కడా నడవకుండా, నాలుగు ఊళ్లలో మాత్రం ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఆ తర్వాత కారు ఎక్కి చేస్తారా? అనేది వారే చెప్పాలి.

ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టడానికి వీలు లేదని, ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవం మీద, అభివృద్ధి మీద దెబ్బ కొట్టడానికి ఈ యాత్రలు, అమరావతి ఉద్యమం అంటూ మరో డ్రామా మహానటులతో రక్తి కడుతున్నాయి.రేపు ఆ టాటా సఫారీ వాహనానికి పూజలు చేసి, కొబ్బరికాయ కొడితే మంచిది.

గద్దె తిరుపతిరావు కారులో ప్రయాణం చేయడం ఘనమైన కార్యక్రమం అని టీడీపీ శ్రేణులు చెప్పదల్చుకుంటే అది వారి ఇష్టం. పాదమూ లేదు. యాత్ర లేదు. పరమ జోకర్‌గాళ్లందరినీ ముందుకు తోసి గడ్డాలు, మీసాలు పెంచి చేస్తున్న ఈ నటనకు ఏ ఒక్కరైనా ఎందుకు స్పందిస్తారు.చివరగా ఒక ప్రశ్న. లోకేష్‌ పాదయాత్ర అయినా కాళ్లతోనే చేస్తారా? లేక కాళ్లు వాహనంలో పెట్టి చేస్తాడా? అన్నది వేచి చూడాలి. ఇంతకు ముందే మేము చెప్పినట్లు ప్రజలకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌ కాదు, అది కేవలం ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ అని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

LEAVE A RESPONSE