Suryaa.co.in

Andhra Pradesh

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కాదు…జే గ్యాంగ్‌ టైట్లింగ్‌ చట్టం

-ఇదీ..జగన్‌ మార్క్‌ భూ భక్ష పథకం..
-తాత,ముత్తాత జాగీరులాగా ప్రజల ఆస్తిపై కన్ను
-జగన్‌, బొత్స, ధర్మాన, సజ్జల పొంతన లేని వ్యాఖ్యలు
-ప్రజల కష్టార్జితానికి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు పేరేంది
-నీతి అయోగ్‌ చెప్పింది వేరు..జగన్‌ గ్యాంగ్‌ మార్పులు చేసింది వేరు
-రెండిరటికీ తేడాలు గమనించండి…ప్రజలు మేల్కోవాలి
-బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

మంగళగిరి: రాష్ట్రంలో పెట్టింది ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కాదని, జే గ్యాంగ్‌ టైట్లింగ్‌ చట్టమని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ధ్వజమెత్తారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం…జగన్‌ గ్యాంగ్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చుట్టమని విమర్శించారు. ప్రజల ఆస్తిపై తన తాత,ముత్తాత జాగీరులాగా కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపిం చారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై ముఖ్యమంత్రి జగన్‌, బొత్స, ధర్మాన, సజ్జల పరస్పరం పొంతన లేని వ్యాఖ్య లు చేస్తున్నారు. ఒకరు మంచి చట్టం అంటారు, మరొకరు చట్టం అమలులో లేదంటారు, ఇంకొకరు అమలు చేసేది కాదంటారు. ప్రజలను గందరగోళంలో నెట్టివేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన చట్టాలు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం లేదనే ధ్యాసలేని మంత్రులు పనిచేయడం దౌర్బా గ్యమని మండిపడ్డారు.

ప్రజల ఆస్తులలో వైఎస్సార్‌ కుటుంబానికి వాటా ఉందా?
చట్టాలు మంచివే…అమలు చేసేవారికి దురుద్దేశాలు ఉన్నప్పుడు తప్పులు చేస్తారు. తమ స్వంత అవకాశాల కోసం తప్పులు చేయడంలో వైకాపా నాయకులు సిద్ధహస్తులు. రెవెన్యూ, డీకేటీ, అటవీ, దేవాదాయ శాఖ భూములు దోపిడీ అయిపోయి ఇప్పుడు ప్రజల కష్టార్జితం లేదా వారసత్వ భూములపైన జేె గ్యాంగ్‌ కన్ను పడిరది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష చట్టం అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? ప్రజల కష్టార్జితం లేదా వారసత్వ భూములకు వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు అనడమేంటి? ప్రజల ఆస్తులలో వైఎస్సార్‌ కుటుంబానికి వాటా ఉందా? ఆ వాటా ప్రజలకు వదులుకున్నట్లా? ఏమిటి ఈ దుర్మార్గమని ప్రశ్నించారు.

నీతి ఆయోగ్‌ చెప్పిందేమిటి? మీరు చేసిందేమిటి?
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం సంబంధించి నీతి ఆయోగ్‌ చెప్పింది ఏమిటి? జగన్‌ చేసింది ఏమిటి? రైతుల పాస్‌ బుక్‌, టైటిల్‌డీడ్‌పై జగన్‌ ఫొటో నీతి ఆయోగ్‌ పెట్టమందా? ప్రజల ఆస్తుల సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మలు వేయమని నీతి అయోగ్‌ చెప్పిందా? ప్రజల ఆస్తుల రిజిస్ట్రేషన్‌ దస్తావేజులపై జగన్‌ ఛాయాచితం పెట్టమని నీతి ఆయోగ్‌ చెప్పిందా? రాష్ట్రంలో ఇప్పుడు జగనన్న భూభక్ష నుంచి రక్షణ అవసరమైంది. ప్రజల ఆస్తులను జే గ్యాంగ్‌ నుంచి కాపాడాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అవసరం. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చాలా అస్పష్టంగా తయారుచేశారు. దోచేసిన లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూములు, ఏమయ్యా యో తెలియని 40 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు, అస్మదీయుల పవర్‌ ప్రాజెక్టుల కోసం దోచేసిన లక్షలాది ఎకరాల రెవెన్యూ, అటవీ, ప్రైవేటు భూములను ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ద్వారా ఇష్టం వచ్చిన నిబంధనలను చేర్చి క్రమబద్ధీకరిం చుకోవాలని జగన్‌ మార్పులు చేయాలని ప్రయత్నించడం వల్లే హైకోర్టులో ఈ చట్టం అమలుకు అడ్డంకులు ఏర్పడిరది నిజం కాదా? అని ప్రశ్నించారు.

నీతి ఆయోగ్‌ సూచించిన అంశాలు, జగన్‌ చేసిన చట్టానికి మధ్య అంతరాలు ఇవే…

1) టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ నియామకం :
నీతి ఆయోగ్‌ సిఫారసు ప్రకారం : ప్రభుత్వ అధికారిని నియమించాలి.
జగన్‌ తెచ్చిన చట్టం ప్రకారం : ఎవరినైనా నియమించుకోవచ్చు.
జే గ్యాంగ్‌ ప్రణాళిక : వైకాపా నాయకులను టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌గా
నామినేట్‌ చేసి ప్రజల ఆస్తులు దోచుకోవడం.

2) రిజిస్టర్‌లో నమోదు అనంతరం ఆస్తి యాజమాన్య కాలపరిమితి:
నీతి ఆయోగ్‌ సిఫారసు ప్రకారం : మూడు సంవత్సరాలు
జగన్‌ తెచ్చిన చట్టం ప్రకారం : రెండు సంవత్సరాలు
జే గ్యాంగ్‌ ప్రణాళిక : అభ్యంతరాలు లేవనెత్తడం కోసం
తగిన సమయం ఇవ్వకుండా ఇతరుల
ఆస్తులు దోచుకోవడానికి.

3) వివాదాల పరిష్కారం:
నీతి ఆయోగ్‌ సిఫారసు ప్రకారం : వివాదాల పరిష్కారానికి భూమి వివాదాల పరిష్కార అధికారికి పంపాలి.
జగన్‌ తెచ్చిన చట్టం ప్రకారం : నేరుగా ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్‌కి పంపాలి.
జే గ్యాంగ్‌ ప్రణాళిక : అంటే ప్రజల భూముల మాటున వివాదాలను సృష్టించి పరిష్కారానికి
అవకాశం లేకుండా అప్పీలేట్‌ ఆఫీసర్‌కు పంపడం అంటే జగన్‌ గ్యాంగ్‌ ఆ భూములను వివాద పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా దోచేద్దామనే ప్రణాళిక కనపడుతుంది.

4) తప్పు చేసిన అధికారులు, విధి నిర్వహణలో తప్పులకు చర్యలు:
నీతి ఆయోగ్‌ సిఫారసు ప్రకారం : చట్టరీత్యా శిక్షార్హులు.
జగన్‌ తెచ్చిన చట్టం ప్రకారం : ఆసక్తికరమైన విషయమేమిటంటే సెక్షన్‌ 67(2) ప్రకారం
తప్పు చేసిన అధికారులను, అవినీతి అధికారులను రక్షించాలని జగన్‌ ప్రభుత్వం కోరుకుంటుంది.
జే గ్యాంగ్‌ ప్రణాళిక : అవినీతి భూ కబ్జాదారుల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని నిర్వహించ గలిగే అధికారులు ఎలాంటి చిక్కులు లేకుండా తప్పించుకోగలరని ఈ సెక్షన్‌ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది చాలా నియంతృత్వ భావనగా ఉంది.

నీతి ఆయోగ్‌ ప్రతిపాదనలకు నీళ్లు
పేద రైతులు, అట్టడుగు వర్గాల విలువైన భూములను లాక్కోవడానికి ఈ చట్టాన్ని సులువుగా ఉపయోగిం చుకునే భూ మాఫియా, భూ కబ్జాదారులతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా కక్ష సాధిస్తోందనడానికి పైన తెలిపిన నీతి ఆయోగ్‌ సూచనలను కాకుండా ఇష్టారాజ్యంగా జగన్‌ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రూపొందించింది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదనలకు విరుద్ధంగా ప్రజల స్వార్జితాన్ని దోచేసే విధంగా జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీరుతో భూ మాఫియా పెట్రేగిపోయే ప్రమాదం కనపడుతుంది. అందువల్లే హైకోర్టు ఈ చట్టాన్ని నిలుపుదల చేసింది.

LEAVE A RESPONSE