Suryaa.co.in

Features

సగటు భారతీయుడి జీవితంలో వచ్చిన మార్పు ఏమీ లేదు

ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15న…. సగటు భారతీయుడి జీవితంలో వచ్చిన మార్పు ఏమీ లేదు.
1947 ఆగస్టు 15 న బ్రిటిష్ దోపిడీదారుల చేతిలో నుండి భారతీయ దోపిడీదారులకు అధికార మార్పిడి జరిగింది. మిగతాదంతా సేమ్ టు సేమ్.
కానీ….. 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం… అప్పటివరకు ఈ దేశంలో అమలులో ఉన్న కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా…. బేధాల నుండి, అసమానతల నుండి, వివక్ష తలనుండి ప్రతి పౌరుడికి విముక్తి కలిగిస్తూ…. రక్షణ చట్టాలు ఏర్పాటు చేసింది.
వేల సంవత్సరాల కులవివక్షతను రద్దు చేస్తూ దళిత, గిరిజనులకు సమానత్వాన్ని ఈ రాజ్యాంగం కల్పించింది.

ఏ కులంలో పుట్టినా… న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అని చెప్పి… స్త్రీలను బానిసలుగా చూసే దుర్మార్గ పురుషాధిక్య సమాజం లో… స్త్రీలకు సమానత్వాన్ని కల్పించింది.
పాలించేవాడు బౌద్ధాన్ని ఆచరిస్తే… ప్రజలు కూడా దాన్ని ఆచరించే…
పాలించేవాడు ఇస్లాం ను ఆచరిస్తే… ప్రజలు కూడా దాన్ని ఆచరించే…
పాలకులు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తే… ప్రజలు కూడా దాన్ని ఆచరించే… బలవంతపు మత విశ్వాసాల బంధనాలు తెంచి…. ప్రతి పౌరుడికి మతస్వేచ్ఛ ప్రసాదించింది.
నూరు పూలు వికసించనీ… వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ… అనే ప్రజాస్వామిక సూత్రాన్ని అమలు చేస్తూ…. ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్చ ని ఇచ్చింది.

వేల సంవత్సరాల రాచరిక పాలనను అంతం చేస్తూ…. దేశ అధ్యక్షుడు ప్రజల నుండి ఎన్నికయ్యే ప్రజాస్వామ్య విధానాన్ని ఇచ్చింది.

ఈ రాజ్యాంగం రాకముందు… అధికారం, భూమి క్షత్రియుల చేతుల్లో…. చదువులు, సంస్కృతులు బ్రాహ్మణుల చేతుల్లో… వర్తక, వ్యాపారాలు వైశ్యుల చేతుల్లో కేంద్రీకరణ జరిగి…. సమాజంలో 95 శాతం మంది…. కమ్మ ,రెడ్డి, కాపు, మాల, మాదిగ, యాదవ, గౌడ, మంగలి, చాకలి … మొదలైన శ్రామిక కులాలు, ఏ హక్కులు లేకుండా, చదువుకునే అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు/ ఉపాధి లేకుండా
అభివృద్ధి కి దూరంగా బతికేవారు.

అలాంటి వాళ్లకి…
అంటే…
రైతులకు….
కూలీలకు….
చేతి
వృత్తులవారికి…
అందరికీ…
సమాన అవకాశాలు కల్పించింది.
ఎదగటానికి ఉన్న అవరోధాలను… చట్టబద్ధంగా తొలగించింది.

ఈ రాజ్యాంగం రాకముందు…
కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లింగాన్ని బట్టి…. నేర నిర్ధారణ, ఉద్యోగుల ఎన్నిక జరిగేది.
కానీ ఈ రాజ్యాంగం RULE OF LAW …. అంటే… చట్టం ముందు అందరూ సమానమే… అనే అత్యున్నత మానవ హక్కుని ఈ దేశంలో ప్రవేశపెట్టింది.

క్షత్రియుడు కాదని ప్రతిభావంతుడైన కర్ణుని సైతం తిరస్కరించింది ఆనాటి అసమ సమాజం.
ఆ అసమానతలను రద్దు చేస్తూ…
ఒక మహిళ ను… అది కూడా ఒక వితంతువు ని… ప్రధానమంత్రిని చేసింది ఈ రాజ్యాంగం.
ఒక ముస్లిం ని రాష్ట్రపతి ని చేసింది ఈ రాజ్యాంగం.

అసలైన భారతీయ సంస్కృతికి కేంద్రమైన తమిళనాడులో
ఒక మంగలి కుటుంబంలో తండ్రి, కొడుకుల ను ముఖ్యమంత్రులను చేసింది ఈ రాజ్యాంగం.
జార్ఖండ్ లో ఒక గిరిజనుడుని ముఖ్యమంత్రిని చేసింది ఈ రాజ్యాంగం.
ఉత్తరప్రదేశ్లో
ఒక దళిత మహిళను నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేసింది ఈ రాజ్యాంగం.
ఛత్తీస్ ఘడ్ లో ఒక గిరిజన ఐఏఎస్ అధికారి ని ముఖ్యమంత్రిని చేసింది ఈ రాజ్యం గం.
ఒక నిరక్షరాస్యుడిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని చేసింది ఈ రాజ్యాంగం.

కానీ….
అజ్ఞానాన్ని…
మూడత్వాన్ని…
ద్వేషాన్ని…
అసమానతలను…
పేదరికాన్ని…

పెంచి పోషించే….
మత గ్రంథాలకు ఉన్న ప్రాధాన్యత… ఈ దేశంలో రాజ్యాంగానికి లేదు.

ఎందుకంటే…
నా దేశంలో శాస్త్రవేత్తల కన్నా…
స్వామీజీ లెక్కువ.

ఓం…
అంబేడ్కరాయ నమః

kolikapudi
– కొలికపూడి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE