(వీరభద్రరావు)
నౌ..కాకినాడ.. ఈ టైమ్ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షిప్‌ల తయారీ రంగానికి కేంద్రంగా కాకినా డను తీర్చిదిద్దేలా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీ లో నౌకా నిర్మాణ క్లస్టర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో కాకినాడలో వీటి తయారీ భవిష్య త్తులో భారీగా పుంజుకోబోతోంది.
అటు రూ.300 కోట్లతో చిన్న, మధ్యతరహా నౌకల నిర్మాణానికి వీలుగా షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు అధికా రులు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు కాకినాడలో చిన్న, మధ్యతరహా నౌకలు, బార్జీలు, టగ్‌ల తయారీకి ఊతం లభించనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం మారిటైం పాలసీ కింద నౌకల తయారీ క్లస ్టర్లకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించడం, అటు మారిటైం బోర్డు కార్యాలయం సైతం ఇక్కడే ఉండడంతో కాకినాడ దశ తిరగనుంది.