యుఎస్‌లో ఎంఎస్ కోసం వెళ్తున్న పేద విద్యార్థినికి సహాయం అందించిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఎన్ఆర్ఐ ల సహాయ సహకారాలతో ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను చేస్తుంది. ప్రతిభ ఉన్న వారిని పై చదువులకోసం విదేశాలకు ప్రోత్సహించడమే కాకుండా వారికి కావాల్సిన సమగ్రమైన గైడెన్స్ తో పాటు వివిధ రకాల సహాయ సహకారాలను ఎన్నారైల సహకారంతో ఈ సెల్ అందిస్తుందని కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తెలిపారు.
అందులో భాగంగా పలికే శ్రీనివాసరావు (వాసు) గత 25 సంవత్సరమల నుండి టీడీపీ ప్రధాన కార్యాలయం లో అటెండర్ గా పని చేస్తున్నారు. అతని కుమార్తె పలికే సంధ్య టీడీపీ సహకారంతో 6వ తరగతి నుండి ఫార్మసీ వరకు మంచి మార్కులతో పూర్తిచేసింది. ఇప్పుడు పై చదువుల నిమిత్తం సంధ్య కు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కలిగింది.
కాగా, అమెరికాలోని చార్లెట్ లో నివశిస్తున్న తెనాలి వాసి అయినంపూడి శ్రీహరి విదేశీ ప్రయాణం కి సంబంధించిన టికెట్ ను స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ MLC T.D. జనార్దన్, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ చీఫ్ డాక్టర్ రవి వేమూరి మరియు బుచ్చి రాంప్రసాద్ చేతుల మీదగా వీరికి టికెట్ అందించడం జరిగింది.
గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పలువురు విద్యార్థులకు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ద్వారా అయినంపూడి శ్రీహరి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వీరు చేస్తున్న సేవను ఈ టిక్కెట్ అందించిన నాయకులతో పాటు ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అయినంపూడి శ్రీహరిని అభినందించడం జరిగింది.
అదే విధంగా విషయం తెలుసుకొని స్వయం గా ముందుకు వచ్చి టికెట్ కు సహాయం అందించినందుకు శ్రీహరిని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ చీఫ్ డాక్టర్ రవి వేమూరి మరియు కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ లు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.