Suryaa.co.in

International

సింగపూర్ గడ్డపై ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుక

– తరలివచ్చిన తెలుగువారు
– ముఖ్య అతిథులుగా హాజరైన పయ్యావుల కేశవ్, మంతెన రామరాజు, సాయిబాబా

సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ నిర్వహించిన అన్న నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు జూన్ 18 న జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ , ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు , 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ శేష సాయిబాబ హాజరై ప్రసంగించారు
పయ్యావుల కేశవ్ గారు ప్రసంగంలో అన్నగారు, చంద్రబాబు తో తనకున్న అనుభవనాలను పంచుకోగా , రామరాజు , సాయి .. అన్నగారు తెచ్చిన సంస్కరణల గురించి ప్రసంగించారు, అందరూ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ వస్తేనే అన్నగారి ఆశయాలు కొనసాగించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 800 మంది పైగా అన్న అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE