-కేసీఆర్ దండు పార్లమెంట్ లో ఉంటేనే తెలంగాణకు మేలు
-రద్దు చేసిన ఐటీఐఆర్ పై కాంగ్రెస్ మాట్లాడలేదు
-బండి సంజయ్ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు
-రాష్ట్రం దివాళా తీసిందని తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం
-రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకుంటున్నారు
-వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని బొందపెడతారు
-మోదీతో పోరాటం చేసే ఏకైక నాయకుడు కేసీఆర్
-కేసీఆర్ పూర్తిగా కొలుకోవడానికి నాలుగు వారాల సమయం
-బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సరిగ్గా నెల రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నెల రోజుల్లో అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై రివ్యూ సమావేశం నిర్వహించాము. మా ఎమ్మెల్యే ఒడిపోతారు కానీ కేసీఆర్ సీఎంగా వుంటారు అని ప్రజలు భావించారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకువచ్చిన కొన్ని కార్యక్రమాలు సవరణ చేస్తే బాగుండేదని కార్యకర్తలు మా దృష్టికి తెచ్చారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలన,అభివృద్ధి విషయంలో,కరెంటు విషయంలో ప్రజల్లో ఎలాంటి అపోహలు లేవు. చిన్న,చిన్న లోటుపాట్లను సవరించుకుంటే బాగుండేది.ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాన్ని ఖండించడంలో విఫలం అయ్యాము. దేశంలో అత్యధిక ఉద్యోగాలు,ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చి చెప్పుకోలేకపోయాము.
పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని మా దృష్టికి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓటు వేశారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి గా లేరనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని కార్యకర్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఎన్నికల్లో ఇచ్చింది. కాంగ్రెస్ వాగ్ధానాలను ఇంటింటికి బిఆర్ఎస్ కార్యకర్తలు తీసుకువెళ్తారు. పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు,అసెంబ్లీ రివ్యూ సమావేశాలు పెట్టుకుంటాము.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బిఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతోంది.తుంగతుర్తిలో మా నాయకులపై రెండు సార్లు దాడి జరిగింది.పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తాయి. బి ఆర్ ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో బీజేపీ ఎమ్మెల్యేలు మూడు,నాలుగు సార్లు ఓడిపోయిన సానుభూతితో ఈ సారి గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గళం,తెలంగాణ దళం,తెలంగాణ బలం వుండాలంటే బిఆర్ఎస్ ఎంపీలు గెలవాలి.
పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఎంపీకు శ్రీరామరక్షగా ఉంటారు.తెలంగాణ అంశాలపై పార్లమెంట్ లో ప్రశ్నించాలంటే బిఆర్ఎస్ గెలవాలి. ప్రతి రాష్ట్రంలో గుర్తింపు,అస్థిత్వం వున్న నాయకుడు ఉంటారు. బెంగాల్ లో మమతా బెనర్జీ,తమిళనాడులో స్టాలిన్, ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్,ఒడిశాలో నవీన్ పట్నాయక్. తెలంగాణ అంటే గుర్తు వచ్చేది కేసీఆర్,బిఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ వలన తెలంగాణ వచ్చింది,రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది.
దేశంలో 32 పార్టీలను ఒప్పించి తెలంగాణను కేసీఆర్ సాధించారు.అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే…నేడు తెలంగాణ స్వయంపాలనలో వుంది. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలు…తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకు వస్తారు. కేసీఆర్ దండు పార్లమెంట్ లో ఉంటేనే తెలంగాణకు మేలు జరుగుతుంది. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపితే,బయ్యారం ఉక్కు పరిశ్రమ,విభజన హామీల కోసం తెలంగాణ సమస్యలపై బిఆర్ఎస్ పార్లమెంట్ లో పోరాటం చేసింది.వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటం చేసింది బిఆర్ఎస్.
మోటార్లకు మీటర్లు పెడతామంటే అడ్డుకుంది కేసీఆర్.సింగరేణిని ప్రయివేటు పరం కాకుండా అడ్డుకుంది కేసీఆర్. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలకు తెలంగాణపై ప్రేమ ఉండదు.రద్దు చేసిన ఐటీఐఆర్ పై కాంగ్రెస్ మాట్లాడలేదు.బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండకపోతే తెలంగాణ గళం ఉండదు. తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు అందరూ ఏకం అవుతారు.
కాంగ్రెస్,బీజేపీ పార్లమెంటరీ సమావేశాల్లో తెలంగాణ పదం ఏనాడైన వినపడిందా? బిఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే పార్లమెంట్ లో తెలంగాణ పదం నిషేధం అవుతుంది.బండి సంజయ్ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటి అయ్యేటట్లు వున్నారు. తెలంగాణ అస్థిత్వం నిలబడాలంటే పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. అధికారం కోసం అడ్డగోలుగా కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. శ్వేతపత్రాలతో హామీలు ఎగనామం పెట్టె డ్రామాలు కాంగ్రెస్ ఆడుతోంది.
కార్లను విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ కోసం పెడితే కేసీఆర్ స్వంతానికి పెట్టుకున్నట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రం దివాళా తీసిందని తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపిలను గెలిపిస్తే రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. కాంగ్రెస్ పరిపాలనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ఒకే సారి రైతులకు 12 వేల కోట్లు జమ చేసిన ఘనత బిఆర్ఎస్ కు దక్కుతుంది. అబద్దాలను ఆస్త్రంగా వాడుకుని కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచింది. వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని బొందపెడతారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయలేదు…ఆస్తులు సృష్టించాము. తెలంగాణలో పారే నీళ్లు,త్రాగే నీళ్లు,పండిన పంటలు,కరెంటు బిఆర్ఎస్ ప్రభుత్వానికి సాక్ష్యం.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో,మండలంలోస్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేస్తాము. ఖమ్మం ఏడు మండలాకు,సీలేరు ప్రాజెక్టును ఆంధ్రకు ఇస్తే కాంగ్రెస్ ఒక్క రోజు మాట్లాడలేదు. హై కమాండ్ అనుమతి లేనిది కాంగ్రెస్,బీజేపీ ఎంపీలు మాట్లాడలేరు. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారు. బీజేపికి ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్పాలి. తెలంగాణ విభజన హామీలు,కాజీపేట కోచ్ పరిశ్రమ,బయ్యారం ఉక్కు పరిశ్రమ,ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా చేసింది బీజేపీ.
ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమను తెరుస్తామని తెరవనిది బీజేపీ. మత విద్వేషం తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. మోదీతో పోరాటం చేసే ఏకైక నాయకుడు కేసీఆర్. పౌరసత్వ బిల్లును అడ్డుకుంది కేసీఆర్. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కుమ్మక్కు అయ్యి రాజకీయాలు చేస్తాయి. బీజేపీకి చెందిన బండి సంజయ్,ఈటెల రాజేందర్,అరవింద్ ను ఓడించింది బిఆర్ఎస్ మాత్రమే. బిజెపిని ఓడించే శక్తి బిఆర్ఎస్ కు మాత్రమే వుంది.
కేసీఆర్ పూర్తిగా కొలుకోవడానికి నాలుగు వారాల సమయం పడుతుంది. కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన వుంటుంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి మొదలు అయింది. తెలంగాణ బలం,తెలంగాణ గళం,తెలంగాణ దళం పార్లమెంట్ లో ఉండాలంటే బిఆర్ఎస్ గెలవాలి.