Suryaa.co.in

Andhra Pradesh

అన్న సేవలు చిరస్మరణీయం

– టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లుక్కా సాయిరాం గౌడ్

విజయవాడ: జిల్లా పార్టీ కార్యాలయంలో అన్న నందమూరి తారకరామారావు 100 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు,కార్యకర్తలకు పంచి పెట్టారు.

లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ మహానటుడే కాకుండా మహోన్నత రాజకీయవేత్త అని అన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పేదవారి ఆక్రందనలకు చలించి, తను అగ్ర నటుడిగా వెలుగొందుతున్న సినీ పరిశ్రమను విడనాడి, తెలుగుదేశం పార్టీ అని నామకరణం తో రాజకీయ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే రాజ్యాధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.తాను ముఖ్యమంత్రి కాగానే అప్పటివరకు పేదలకు ఇస్తున్న పాకల స్థానంలో పక్క గృహ నిర్మాణాలు చేపట్టిన తొలి వ్యక్తి అని, రెండు రూపాయలకే కిలో బియ్యం, జనత వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారి వ్యవస్థ ను రద్దు చేయడం ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి చరిత్రకి ఎక్కిన ఘనుడు అన్న ఎన్టీఆర్ గారు అన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం, మహిళలకు 9% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి అని, అందువల్లనే ఎన్టీఆర్ భిక్షతోనే రాజకీయాల్లో ఎంతోమంది బీసీలు, మహిళలు రాజకీయలలో ఉన్నతమైన స్థానాలకు ఎదిగారని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పయనిస్తూ, బీసీలకు, మహిళలకు ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించారని,5 రూపాయలకె అన్నా క్యాంటీన్ లు పెట్టి పేదవాడికి కడుపునిండా భోజనం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు ది అన్నారు.

జగన్ రెడ్డి రాక్షస పాలనను అంతమొందించడానికి అన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నాంది కావాలన్నారు. తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని, చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవడమే అన్న ఎన్టీఆర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళులు అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు,కృష్ణా జిల్లా బీసీ గౌడ సాధికారిక కన్వీనర్ శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్,ఎన్టీఆర్ జిల్లా బిసి గౌడసాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE