కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. మునుగోడులో భాజపా సమరభేరి సభ
ముగిసిన తర్వాత అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. నోవాటెల్‌లో అమిత్ షా, ఎన్టీఆర్ ఇరువురు సమావేశమయ్యారు. ఇటీవల అమిత్ షా
ఆర్ఆర్ఆర్ సినిమా చూశారని, అందులో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని.. అభినందించేందుకే పిలిచారని ప్రచారం జరుగుతోంది. కారణమేదైనా.. ఎన్టీఆర్, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా అగ్ర నాయకత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగానూ ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.