Suryaa.co.in

Features

ఆస్పత్రిలోని అమ్మ.. నర్సులమ్మ!

ఎక్కడ కరుణ వర్షిస్తుందో..
ప్రేమ అమృతమై ప్రవహిస్తుందో
సేవ సర్వాంతర్యామిగా పరిఢవిల్లుతుందో..
అక్కడ నర్సు ఉన్నట్టే ..
ఆమె ఉంటే
స్వాంతన లభించినట్టే
ఆపై ప్రాణం నిలిచినట్టే..!

ఆస్పత్రిలో నైరాశ్యంలో
నువ్వునప్పుడు..
బంధువులు సైతం
నీపై ఆశ వదులుకున్నప్పుడు..
ఒక్కడివై..దిక్కుతోచక..
రేపనే రోజు
చూస్తావో లేదో
తెలియని స్థితిలో..
ఒక చల్లని స్పర్శ..
మమకారం నిండిన చూపు..
ఆ ఒక్క చూపులోనే
ఎంత భరోసా..
ఇంకెంత విశ్వాసం..
లాలన..ఆదరణ..
నీ దరి చేరి..
నీకు నేనున్నాననే
నమ్మకం కలిగించి..
నీ పక్క బట్టలు..
నీ ఒంటిపై ఆచ్చాదనలు
సరి చేసి..
నీ అవశిష్టాలను
తనే శుభ్రం చేసి..
భద్రం అని చెప్పి…
ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ..
మందులిస్తూ..వేసుకోనంటే సున్నితంగా మందలిస్తూ..
నిజంగా ఇవన్నీ
అమ్మ గాక ఇంకెవరు చేస్తారు
నర్సు తప్ప..
పిలుపునకు సిస్టర్
వృత్తికి నర్సు..
ప్రవృత్తికి మాత్రం అమ్మ..!

నీ సేవలో తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించేది..
నిన్ను బ్రతికిస్తే
తనకేంటి లాభం
అనుకుంటూ పర్సు చూసుకోనిది నర్సు..
నారు పోసేది డాక్టరైతే
నీరు పోసేది నర్సు..
ఆస్పత్రికి వెళ్లి
నువ్వు కోలుకున్నా..
మళ్లీ ఆరోగ్యంగా
ఇంటికి చేరినా..
కారణం ఆమె ఆదరణం..
సేవకు ఆమే ప్రేరణం..
నిజానికి నీ ఆరోగ్యమే
ఆమెకు మహాభాగ్యం..
you are discharged safe because your nurse discharged her duty honestly..
not only with care but also with lot of love..
Her duty is really Devine..
– ప్రతి నర్సుకు పాదాభివందనంతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE