గుంటూరు: రాష్ట్ర జి. ఎస్.టి శాఖ ప్రత్యేక కమిషనర్ గా నూతలపాటి సౌమ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఉదయం స్టేట్ ట్యాక్సెస్ (జీఎస్టీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో నూతన బాధ్యతలు చేపట్టారు. డిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు సౌమ్య కేంద్ర సర్వీసు నుండి రాష్ట్ర సర్వీస్ కు డిప్యూటేషన్ ప్రాతిపదికన బదిలీ అయ్యారు.
గుంటూరులోని కస్టమ్స్, జి. ఎస్.టి అప్పీల్స్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తూ, ఈ నెల 12 న రిలీవ్ అయ్యి, అదే రోజున ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసారు. కాగా సోమవారం ఆమెకు పోస్టింగ్ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు చెందిన సౌమ్య సీనియర్ అధికారి కావటంతో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఎస్.టి శాఖ లో ప్రత్యేక కమిషనర్ హోదా కల్పించింది. ఆమె మూడేళ్ల పాటు స్టేట్ జి.ఎస్.టి శాఖలో పనిచేస్తారు.