గుంటూరు: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండైరెక్ట్ టాక్సస్ అండ్ కస్టమ్స్ శాఖకు చెందిన ఐ.అర్.ఎస్ అధికారిణి నూతలపాటి సౌమ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర పన్నుల ( జి.ఎస్.టి ) విభాగంలో అడిషనల్ కమిషనర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సౌమ్య 2011 బ్యాచ్ కు చెందిన సివిల్ సర్వీసెస్ ఐ.అర్.ఎస్ అధికారిణి. ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు స్వీకరించిన తేది నుండి మూడేళ్ల పాటు ఆమె డిప్యూటేషన్ పై రాష్ట్రం లో పనిచేస్తారు. సౌమ్య డిప్యూటేషన్ ను క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.ప్రస్తుతం సౌమ్య గుంటూరులోని కస్టమ్స్ అండ్ జి.ఎస్ టి అప్పీల్స్ కమిషనరేట్ లో అడిషనల్ కమిషనర్ గా సేవలందిస్తున్నారు.
అంతకు పూర్వం విజయవాడలోని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త నియామకం చేపట్టడానికి సౌమ్య ను వెంటనే రిలీవ్ చేయాలని విశాఖపట్నం జోన్ సెంట్రల్ జి. ఎస్.టి చీఫ్ కమిషనర్ కు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు కాపీ పంపించారు.