Suryaa.co.in

Andhra Pradesh National

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు

– రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జాయింట్‌ కమిటీ
– ఉభయ రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడి
– చర్చల తర్వాత సంయుక్త ప్రకటన చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్, వైయస్‌.జగన్‌
ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌ కార్యక్రమానికి హాజరైన వైయస్‌.జగన్‌. అక్కడ నుంచి విశాఖకు, విశాఖనుంచి భువనేశ్వర్‌ చేరుకున్న ఏపీ సీఎం. విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి. స్టేట్‌గెస్ట్‌ హౌస్‌లో సీఎంకు స్వాగతం పలికిన ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు.
ఆ తర్వాత ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మరో దఫా స్వల్ప సమావేశ అక్కడ నుంచి నేరుగా ఒడిశా సచివాలయం లోక్‌సేవా భవన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్న ఏపీ సీఎం.
– వైయస్‌.జగన్‌కు సాదరస్వాగతం పలికిన ఒడిశా సీఎం.
– తర్వాత కన్వెన్షన్‌ రూంలో ఇరువురి మధ్య ఆత్మీయ సమావేశం.
– తర్వాత కాన్ఫరెన్స్‌హాల్లో రెండు రాష్ట్రాల అధికారులతో సమీక్ష.
– ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చీఫ్‌ సెక్రటరీలతో జాయంట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
– సమస్యల పరిష్కారంపై ఈకమిటీ దృష్టిపెడుతుందని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.
– కొఠియా గ్రామాల సమస్య,
నేరడి బ్యారేజీ,
జంఝావతి రిజర్వాయర్‌ ప్రాజెక్టులో మిగిలిపోయిన భాగం పూర్తి లాంటి మూడు ప్రధాన అంశాలతో పాటు వివిధ అంశాలమీద చర్చ జరిగినట్టుగా వెల్లడి.
– పోలవరం కారణంగా పాక్షికంగా ముంపునకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై సూచనలు చేసిన ఏపీ సీఎం
– బలిమెల, అప్పర్‌ సీలేరులో విద్యుత్‌ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌ఓసీ అంశాలు
– బహుదా రిజర్వాయర్‌ నుంచి ఇచ్ఛాపురంకు నీటి విడుదలపైనా చర్చలు
– ఈ అంశాలపై దృషిసారించడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి జాయింట్‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, ఏపీ సీఎం వైయస్‌.జగన్‌
– రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటవుతుందని వెల్లడి
– దీనికి సంబంధించి అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదల చేసిన రెండు రాష్ట్రాలు
– మావోయిస్టు కార్యకలాపాల నియంత్ర, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించాలని, కలికట్టుగా ఎదుర్కోవాలని ప్రకటనలో పేర్కొన్న ఇరు రాష్ట్రాలు.
– సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్‌ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షలు నిర్వహణను సోదరభావం పెంపొందించేందుకు చేపట్టాలని నిర్ణయం.
– ఈదిశగా అడుగులు వేయడానికి శ్రీకాకుళంజిల్లాలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…
– సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కృతం కాని అంశాలు ఉన్నాయి. తొలిసారిగా ఈ అంశాలను పరిష్కరించడానికి అడుగు ముందుకేశాం.
– ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరం.
– చీఫ్‌సెక్రటరీలతో ఏర్పాటయ్యే కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్తుంది. వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుంటుంది.
– చర్చలు జరపడమే కాదు, జాయింట్‌ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కి, ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర అధికారులకు ధన్యవాదాలు.
– కలికట్టుగా, సహకార ధోరణితో వీటిని పరిష్కరించుకుంటాం.
– రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే ధ్యేయం.

LEAVE A RESPONSE