Suryaa.co.in

Andhra Pradesh

శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారుల సన్నద్ధం

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి దాదాపు 3లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.40లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది.

అల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరో వైపు తుంగభద్ర, సుంకేశుల జలాశయాలు కూడా నిండిపోవడంతో అటువైపు నుంచి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. మరో 13 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంటుంది. దీంతో ఈనెల 30న శ్రీశైలం గేట్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

LEAVE A RESPONSE