-చంద్రబాబు బరువు, ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోంది
– మాజీ మంత్రి జవహర్
రాజమహేంద్రవరం :- వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు ఆరోగ్యంపై జగన్ ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని బయటకు పంపుతోందని మాజీమంత్రి కొత్తపల్లి జవహర్ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల రిపోర్టు కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టును అధికారులు విడుదుల చేశారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘జైల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటిని సప్లై చేయడం వల్లే చంద్రబాబుకు అలర్జీ వచ్చింది. జైల్లో ఉన్న డాక్టర్లు జీజీహెచ్ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి పరీక్షలు చేసి చంద్రబాబు బాగానే ఉన్నారు, కేజీ బరువు పెరిగారని చెప్తున్నారు. చంద్రబాబు జైలుకు తరలించే సమయంలో 72 కేజీలు ఉన్నారు..కానీ ఇప్పుడు 67 కేజీలే ఉన్నారు.
బరువు ఏ విధంగా తగ్గారు, డీ హైడ్రేషన్ కు ఎలా గురయ్యారు? అధికారులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపైనా ప్రభుత్వం రాజకీయ విమర్శలు చేయడం వెనుక సజ్జల స్క్రిప్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. రక్త పరీక్షలు కూడా చేయకుండా ఆయింట్మెంట్ ఇచ్చి అన్నీ చేశామని చెప్తున్నారు. తాను డీహైడ్రేషన్ కు గురైనట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు.
అలర్జీకి గురయ్యారని డాక్టర్లు కూడా చెప్పారు. టెస్టులు చేసిన రిపోర్టలు డాక్టర్లు విడుదల చేయలేదు. చంద్రబాబు బాగానే ఉన్నారని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ద్వారా విడుదల చేయించారు. చంద్రబాబు ఆరోగ్యంపై మాకు పూర్తి అనుమాలు ఉన్నాయి. భద్రతపైనా ఆందోళన ఉంది. వ్యవస్థలను జగన్ మేనేజ్ చేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ను వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఏ మందులు ఇచ్చారో డాక్టర్ల చెప్పాలి. వివరాలు బయట పెట్టాలి.’’ అని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.