తిరుపతి ఘటనలో భక్తులు మృతి చెందిన వైనంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చర్యల కొరడా ఝళిపించారు.
* మృతి చెందిన 6 మందిలో ఒక్కోక్కరికి రూ.25 లక్షల పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం
* ఆరోగ్యం సీరియస్ ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం
* గాయపడ్డ 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి శుక్రవారం శ్రీవారి దర్శనం, వారందరిని వారివారి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే
* నిర్లక్ష్యం వహించిన డిఎస్పీ శ్రీ రమణ కుమార్, టిటిడి గోశాల డైరెక్టర్ శ్రీ హరినాథ రెడ్డిలను విధుల నుండి సస్పెండ్
* టిటిడి జేఈవో ఎం. గౌతమి, టిటిడి సివిఎస్వో శ్రీధర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు బదిలీ