కర్నూలు, నవంబర్ 11: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చొరవతో గురుకుల పాఠశాలలో అధికారులు విద్యార్థినికి సీటు కేటాయించారని కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ కు చెందిన శ్రావణి అనే విద్యార్థిని కర్నూలు జిల్లా కంబాలపాడు గురుకుల పాఠశాలలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా ఆమె వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదంటూ సీట్ నిరాకరించారని మీడియాలో వచ్చిన వార్తలకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మెన్ మాంధాత సీతారామ మూర్తి గారు, జుడిషియల్ సభ్యులు డి.సుబ్రహ్మణ్యం గారు, నాన్ జుడీషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత గారు స్పందించి శ్రావణి అర్హతలను పరిశీలించి కంబాలపాడు గురుకుల పాఠశాలలో చేర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని, అక్టోబర్ 29 లోపల నివేదికను పంపాలని కంబాలపాడు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఆర్జెడి లకు నోటీసులు జారీ చేశారని, కమిషన్ జారీ చేసిన నోటీసులకు స్పందించి గురుకుల పాఠశాల అధికారులు అక్టోబర్ 14వ తేదీన కంబాలపాడు గురుకుల పాఠశాలలో శ్రావణిని చేర్చుకున్నారని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు.