Suryaa.co.in

Features

1947 ఆగస్టు 15న యావత్ దేశం స్వతంత్రం కాలేదు

( పూర్తి స్వాతంత్ర్యం సాధించడంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ హెడ్గే వార్ పాత్ర )

దేశానికి స్వాతంత్రం తామే సంపాదించి పెట్టామని చెప్పే కాంగ్రెస్ నాయకులు రెండు విషయాలు మరిచిపోతుంటారు. ఒకటి స్వాతంత్రం ఏ ఒక్కరి వల్లనో రాలేదని వివిధ ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం నిరంతరం పోరాడటం వల్లనే వచ్చిందని వాళ్లందరూ కాంగ్రెస్ సంస్థ కేంద్రంగా పనిచేశారని చరిత్రను గమనిస్తే అర్థమవుతుంది. రెండోది 1946లో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించగానే కాంగ్రెస్ నాయకులంతా ఇక తమ పని అయిపోయిందని కొత్త ప్రభుత్వంలో ఏ పదవులు పొందాలో నిర్ణయించుకోవడంలో నిమగ్నమైపోయారు. ఈ రెండు విషయాలను కాంగ్రెస్ నాయకులు దాచి పెడుతూ ఉంటారు.

దేశ విభజనను అంగీకరించినప్పుడు అది తెచ్చే భయంకరమైన మారణ కాండను కాంగ్రెస్ నాయకులు ఎవరు కనీసం ఊహించలేకపోయారు .వాళ్లంతా అమాయకులు కాబట్టి అలా ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారని చెప్పడానికి కూడా లేదు .ఎందుకంటే వారు ఎన్నో ఉద్యమాలు నడిపిన వారు వాటిలో పాల్గొన్నవారు ప్రజల్ని ముందుండి నడిపించిన వారు .విభజన వల్ల కలిగే పరిణామాలు గురించి వారి పట్టించుకోలేదన్నది నిజం. నిజానికి పశ్చిమ పాకిస్తాన్లో ఉన్న అనేకమంది కాంగ్రెస్ నాయకులు హింసాత్మక దాడులనుంచి తృటిలో తప్పించుకొని, ప్రాణాలు దక్కించుకొని భారత్ చేరుకున్న వారే .వారిలో అనేకమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సహాయం కూడా పొందారు.

ప్రజలను ఈ హింసాత్మక దాడుల నుంచి రక్షించే బాధ్యతను భుజాన వేసుకున్న ఆర్ఎస్ఎస్ ఆ పనిలో అనేకమంది స్వయంసేవకులను అధికారులను కోల్పోయింది కూడా .దేశ విభజన విషాద గాధ గురించి అక్కడక్కడ ప్రస్తావించి సరిపెట్టారు. కానీ ఆనాటి పరిణామాలకు కారకులు ఎవరన్నది మాత్రం స్పష్టంగా ఎవరూ చెప్పలేదు .దీనివల్ల ప్రభుత్వం చేయవలసిన ,ప్రజల్ని రక్షించాల్సిన పనిని ఆర్ఎస్ఎస్ చేసింది అనే మాట కూడా బయటకు రాలేదు .పైగా అప్పట్లో అతిపెద్ద సంస్థగా పేరుపడిన, దేశ విభజనను అంగీకరించిన కాంగ్రెస్ ప్రజల రక్షణ బాధ్యతను గాలికి వదిలేసింది అన్న విషయం కూడా మరుగున పడిపోయింది.

ఆనాడు దేశానికి స్వాతంత్రం రావడం సంతోషాన్ని కలిగించకపోగా లక్షలాదిమంది జీవితాల్లో చీకటిని నింపింది అన్నది చేదు నిజం .ఆ చీకటిలో ఆర్ఎస్ఎస్ ఒక్కటే చిరు దీపంలా బాధితులకు కొద్దిపాటి ఆశను ధైర్యాన్ని కలిగించింది.

ముస్లిం లీగ్ హింసను అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్
ఆనాటికి సంబంధించిన కొన్ని నిజాలను తెలుసుకోవడం చాలా అవసరం .1946, 1947 మధ్యకాలంలో ఆగస్టు ,సెప్టెంబర్లలో జరిగిన సంఘటనలు భారతదేశ చరిత్రలో రక్తసిక్త అధ్యాయాలు. ముస్లింల నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో మార్చి 23 1940లో లాహోర్లో జరిగిన లీగ్ సమావేశాల్లో ఒక తీర్మానం ఆమోదించారు.హిందుస్థాన్ ను మక్కలు చేసి మాకు పాకిస్తాన్ అప్పగించండి అంటూ ఆ తీర్మానం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. మరోపక్క కాంగ్రెస్ లొ గాంధీ, నెహ్రూ ,పటేల్ వంటి మహానేతులు ఉన్నారు. కానీ వీళ్లంతా జిన్నాను. ముస్లింల ప్రతినిధిగా అంగీకరించారు. గాంధీ ,నెహ్రూ ,పటేల్ లనే హిందువుల నాయకులు గుర్తించారు. హిందూ మహాసభను సావర్కార్ ను పట్టించుకోలేదు.

ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతలు దాదాపు మొత్తం హిందూ సమాజపు ఆమోదాన్ని ,అంగీకారాన్ని పొందారు. ఈ రెండు పక్షాల మధ్యలో తన అధికారంతో చిచ్చు పెట్టి వేడుక చూశాడు మౌంట్ బాటన్ . అప్పుడు అతని వ్యవహార శైలి జాగ్రత్తగా గమనిస్తే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ను సమర్ధించడం ద్వారా భారత్ కు శాశ్వతమైన ఒక సమస్యను మౌంట్ బాటన్ సృస్టీంచాడని అర్థమవుతుంది అని రంగ హరి వ్రాశారు.

“తాము అఖండ భారతాన్ని మాత్రమే కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ 1946లో ఒక తీర్మానం ఆమోదించింది. కత్తిని కత్తితోనే ఎదుర్కొంటాం అంటూ ఉక్కుమనిషి సర్దార్ పటేల్ గర్జిస్తే పాకిస్తాన్ ఏర్పాటు ఒక అద్భుతమైన కళ అంటూ నెహ్రూ తేల్చి పారేశారు. ఇక 6-4-1947,13-4-1947 నాటి ‘హరిజన్’ పత్రికలో గాంధీజీ “ద్విజాతి సిద్ధాంతం వట్టి బూటకం. దీనిని నా మనస్సాక్షి ఏమాత్రం ఒప్పుకోదు…ఈ దేశాన్ని విభజించడం అంటే అరాచకత్వాన్ని ప్రోత్సహించడమే… అది శరీరాన్ని ముక్కలు చేయడం అంత బాధాకరమైన విషయం .ఈ దేశాన్ని ముక్కలు చేయడం కంటే ముందు నన్ను మొక్కలు చేయండి “అని వ్రాశారు .

ఈ నేతల మాటలు ప్రజలపై ఎంతో ప్రభావితం చూపాయి . వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి .దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ నేతలను పూర్తిగా నమ్మారు. కానీ ముస్లిం లీగ్ మరో ఆలోచన లేకుండా 16 ఆగస్టు 1946న ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది .అంతే ముస్లిం మూకలు వేలాదిమంది హిందువులను ఊచకోతకు గురిచేసాయి. ఆనాటి అమానుషమైన ,భయంకరమైన హింసను మాటల్లో వర్ణించలేం. లీగ్ సాగించిన ఈ మారణ కాండతొ కాంగ్రెస్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. యుద్ధం ఎదురైతే ఆఖరి వరకు పోరాడాలని కనీస క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయిన కాంగ్రెస్ బేలగా, చేస్టలుడిగి ఉండిపోయింది”
అహింసాయుత మార్గంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న ప్రజానీకంపై విభజన విఘాతమైంది. హిందువులు ,సిక్కులు ఇతర ప్రజానీకం సర్వం కోల్పోయి కాందీసీకులుగా కట్టు బట్టలతో భారత్ చేరారు.వారి కష్టాలు అందరూ అనుకున్నట్లుగా ఆగస్టు 15 తో తీరిపోలేదు. ఆ తరువాత కొన్ని నెలపాటు అవి కొనసాగాయి.
( స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్ అనే పుస్తకం ఆధారంగా)

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE