Suryaa.co.in

Political News

అదే రోజు ముర్ము.. సోనియా

– అక్కడ ముర్ము ప్రమాణస్వీకారం.. ఇటు సోనియా ఈడీ విచారణ
– ఈడీ విచారణలో ఉడకని సోనియా పప్పులు

ఈడీ సోనియా విచారణ !
సోనియా ఈడీ ఆఫీస్ కి బయలుదేరేముందు అన్ని రాష్ట్రాల నుండి చోటామోటా నాయకులు ఢిల్లీ చేరుకొని ఈడీ ఆఫీసు ముందు ఆందోళనకి దిగారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటూ ప్ల కార్డులు పట్టుకొనిsonia-ed ప్రదర్శన చేశారు. ఈడీ ఆఫీసుకి వెళ్ళే ముందే , సోనియా అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నది. దాని ప్రకారం .. తనతో పాటు తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతించాలి అంటూ. అంతే కాదు, తనకి వ్యక్తిగత సహాయుకుడు కూడా వెంట ఉండేట్లుగా అలాగే, తన తరుపున తన అడ్వకేట్ ని కూడా అనుమతించాలి అని ఆ అప్లికేషన్ లో ఈడీ అధికారులని కోరింది సోనియా. మానవతా దృక్పధంతో ఈడీ అధికారులు సోనియా విన్నవించుకున్న విజ్ఞాపనని అంగీకరించారు కానీ కొన్ని షరతులకి లోబడి మాత్రమే ! సోనియా వెంట వచ్చే వారు ఎవరయినా సరే ఆఫీసు బయటే ఉండాలి తప్పితే, విచారణ జరిగే చోటుకి అనుమతి ఇవ్వము అని.

కానీ సోనియా ఈడీ ఆఫీసులోకి ప్రవేశిస్తూనే.. కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత నా ఆరోగ్యం సరిగా లేదని కాబట్టి, నా కూతురు ప్రియాంక వాద్రా నాకు తోడుగా ఉండడానికి అనుమతి ఇవ్వండి అని అడిగినది. కానీ మహిళా విచారణ అధికారిణి అయిన మోనికా శర్మ.. ప్రియాంకని బయటే ఉండమని, లోపలకి అనుమతించమని ఖరాఖండిగా చెప్పేసింది. ఇది మొదటి షాక్ సోనియాకి. ముందుగానే అడిగిన దానికి ఈడీ అధికారులు స్పష్టంగా తమ షరతులు ఏమిటో చెప్పాక కూడా, చాలా తెలివిగా తన వ్యక్తిగత సహాయకురాలిగాsonia-priyanka-gandhi ప్రియాంకని తీసుకువెళ్లడం, అధికారులు బయటే ఉండి పొమ్మనడం ఎలా అర్ధం చేసుకోవాలి ?
10 ఏళ్లు ఒక తోలు బొమ్మ ప్రధానిని అడ్డం పెట్టుకొని, ఏకఛత్రాధిపత్యంగా ఎఫ్‌ఐఆర్, యుపీఏ చైర్ పర్సన్ గా భారత దేశాన్ని ఏలిన సోనియాకి, ఇలాంటి సంఘటన ఒకటి తాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఊహించి ఉండదు.

రెండున్నగంటల ఈడీ విచారణలో, మొత్తం 20 ప్రశ్నలని సోనియాని అడిగారు ఈడీ అధికారులు. చాలా వాటికి సమాధానం చెప్పకుండా దాట వేసింది తెలివిగా. దానికి కారణంగా తన గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చింది అని, సరిగా మాట్లాడలేకపోతున్నానని సమాధానాలు దాట వేసింది. కొంచెం సేపటి తరువాత తనకి ఊపిరి ఆడటం లేదని, ప్రియాంకని పిలిపించికొని గొంతులోకి స్ప్రే చేసే నేబ్యూలైజర్ ని వాడింది. మరికొంచం సేపటి తరువాత.. తనకి నీరసంగా ఉందని, ఎక్కువసేపు కూర్చోలేనని కీలకమయిన ప్రశ్నలని వేస్తున్న సమయంలో, అధికారులతో విన్నవించుకుంది సోనియా.

మళ్ళీ ప్రశ్నలు వేయడం ప్రారంభించగానే, తన వ్యక్తిగత వైద్యుడిని కలవాలని.. ఎందుకంటే తనకి బాలెన్స్ తప్పిపోతున్నదని, కళ్ళు తిరుగుతున్నాయని అధికారులని కోరింది సోనియా. మొత్తం 20 ప్రశ్నలలో కీలకమయిన ప్రశ్నలు అడిగారు ఈడీ అధికారులు. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ [AJL],యంగ్ ఇండియా [YI], సోనియా కాంగ్రెస్ పార్టీ, AK ఆంథోనీ, మోతీలాల్ వొరా గురుంచినవే. ఇవన్నీ తాను అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నవే కానీ, పేర్లు వేరు వేరుగా ఉన్నాయి. నిజమేనా ? అని అడిగారు.

డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సోనియా తీసుకున్న అప్పు గురించి ఈడీ అధికారులు ప్రశ్నించగా, చాలా సేపు మౌనంగా ఉండి, తరువాత అవేవీ నాకు గుర్తు లేవు, తెలియదు అని సమాధానం ఇచ్చి మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ చాలా స్పెసిఫిక్ గా డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి తీసుకున్న అప్పుకి, AJL,YI,నేషనల్ హెరాల్డ్ ఆస్తుల డాక్యుమెంట్స్ మీద సంతకం చేశారు కదా అని ఈడీ అధికారులు అడిగినప్పుడు.. సోనియా సమాధానం ఇస్తూ.. అవేవీ నాకు తెలియవు. గుర్తుకురావట్లేదు అంటూ.. అవన్నీ చనిపోయిన మోతీలాల్ వోరా చూసుకున్నారు అని బదులు ఇచ్చింది సోనియా. ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా, నాకు తెలియదు అన్నా, నాకు గుర్తుకురావట్లేదు అన్నా లేదా మౌనంగా ఉన్నా ఈడీ కోర్టు, సదరు ప్రశ్నలకి సమాధానంగా ‘అవును’ [admission]అనే నిర్ధారించి తీర్పు ఇస్తుంది. జూలై 25,2022 సోమవారం రోజున మళ్ళీ విచారణకి హాజరుకమ్మని ఈడీ ఫ్రెష్ గా సమన్లు ఇచ్చింది మళ్ళీ! విచారణ జరుగుతున్నంత సేపు ఈడీ ఆఫీసు బయట, కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ ప్రభుత్వపు కక్ష సాధింపు చర్యలని ఆపాలి అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తూ !

చిదంబరం తెలివితేటలు !
ఈ చిదంబరం ఏమన్నాడు అంటే .. అసలు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, ఈడీ సోనియాకి సమన్లు ఇవ్వకూడదు అని. చిదంబరం చాలా సీనియర్ అడ్వొకేట్ మరి ! నల్ల కోటు వేసుకొని అన్ని రాష్ట్రాల హై కోర్టులతో పాటు, సుప్రీం కోర్టు లో కూడా కేసులు వాదిస్తాడు కానీ .. 2012 ఢిల్లీలోని ట్రయల్ కోర్టు లో సుబ్రహ్మణ్య స్వామి, ఒక ప్రైవేట్ కంప్లయింట్ ఇచ్చాడు, నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయంలో అక్రమాలు జరిగాయని. అలాగే వాటికి కావాల్సిన ఆధారాలని కోర్టులో ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి యుపీఏ ప్రభుత్వం, సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ ని కొట్టివేయాలి అంటూ సుప్రీం కోర్టు గడప తొక్కింది. కానీ సుప్రీంకోర్టు, ఢిల్లీ హై కోర్ట్ లో అపీల్ చేయమని చెప్పింది. ఢిల్లీ హైకోర్టు పిటిషన్ ని పరిశీలించిన తరువాత, ట్రయల్ కోర్ట్ ని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది.

ప్రాథమిక సాక్ష్యధారాలు ఉన్నాయని భావించి సదరు కోర్టు , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుండి నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఉంది. 2012 లో యుపీఏ అధికారంలో ఉంది. అందులో ఈ చిదంబరం కూడా కాబినెట్ మంత్రిగా ఉన్నాడు. కానీ ఎఫ్‌ఐఆర్, లేకుండా ఈడీ ఎలా సమన్లు జారీ చేస్తుందని ప్రశ్నించి తన తెలివితేటలు ఎంతలా ఉన్నాయో ప్రపంచానికి తానే స్వయంగా చెప్పుకున్నాడు. సోనియా,రాహుల్ తో సహా.. తానుకూడా బెయిల్ మీద ఉన్నారనే సంగతి మరిచిపోయావా చిదంబరం ?

ఇలా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు 60 ఏళ్లు మనల్ని పరిపాలించారు. కర్ణాటక మాజీ మంత్రిగారు నెహ్రూ,గాంధీ పేర్లు చెప్పుకొని మనం మూడు తరాలకి సరిపడా సంపాదించాము కాబట్టి, ఇప్పుడు సోనియా,రాహుల్ కి మనం అండగా ఉండాలి అంటూ తమంత తామే అవినీతి చేశామని ఒప్పుకున్నాడు. అసలు జరిగింది ఇది అయితే, కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ మాత్రం ఒక కట్టు కధ వినిపించాడు. సోనియా ఎంతసేపయిన ఈడీ ఆఫీసులో ఉండి, అన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తాను అని ధైర్యంగా చెప్పిందిట ! మిమ్మల్ని అడగడానికి మా దగ్గర ప్రశ్నలు లేవని అధికారులు పంపించేశారుట ! ఒక మహిళ భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల 25న. అదే సమయంలో మరో మహిళ సోనియా ఈడీ విచారణ బోనులోకి రెండో సారి వెళ్లబోతున్నది.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

LEAVE A RESPONSE