ఆనాడు…83 జనవరి 5… తెలుగుదేశం ఎదుర్కున్న మొదటి ఎన్నికలు..!
కొంత అనుమానం..ఎంతో ఉత్సాహం..పోలింగ్ అయింది..!
ఊరినుండి రాజమండ్రి వెళ్ళే దారిలో చిన్నపాటి సర్వే ..కనిపించిన వారిని కదిపితే..మొహమాటంగా..ఎటూ చెప్పేవారు కాదు.
మూడోనాడు ఓట్ల లెక్కింపు..!
గోకవరం బస్టాండ్..టెలిఫోన్ ఎక్సేంజ్ దగ్గర ..సమాచార శాఖ వారు..ఫలితాల వెల్లడి కేంద్రం ..డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేసారు.
రేడియో వార్తలు..మైకుసెట్ల కు కనెక్షన్ ఇచ్చారు.
మధ్యాహ్నానికే తొలిఫలితం వెలువడింది.
షాద్ నగర్ ..కాంగ్రెస్ గెలుచుకుంది.
కాంగ్రెస్ వారికి ఉత్సాహం..!
యన్టీఆర్ పార్టీ పరిస్దితి ఏమిటో..సందిగ్ధం..సంశయం..ఇంకోపక్క తెలియని ఆందోళన..!
సాయంత్రానికి ఆధిక్యతలు ..ఫలితాల సరళి మెల్లమెల్లగా మొదలయింది.
ఒక్కో జిల్లా పేరు…!
శ్రీకాకుళం..టెక్కలి..ఇచ్చాపురం..ఆముదాలవలస..టీడీపి ఆధిక్యం..!
విజయనగరం…పార్వతీపురం..nవిశాఖ..చోడవరం…మాడుగుల…అనకాపల్లి..భీమిలి…నర్సీపట్నం..తూర్పు గోదావరి..రాజమండ్రి..కాకినాడ..జగ్గంపేట..పెద్దాపురం..అనపర్తి..ఆలమూరు..కడియం..అమలాపురం..అలా జిల్లాలో మొత్తం ఇరవై స్దానాల్లో టీడీపి ఆధిక్యత..!
అలాగే మొత్తం రాష్ట్రం లో వరస పెట్టి టీడీపి ఆధిక్యతలు వెలవడుతుంటే…!
పార్టీ అభిమానుల కేరింతలు..!
రేడియోలో ..వార్తల గేప్ లో ..అన్నగారి పాటలు..!
తెలుగుదేశం గాలి స్పష్టంగా తెలిసిపోతుంది.
పాట కూడా..వేసారు..కొండగాలి తిరిగిందీ..గుండె ఊసులాడింది…అంటూ ..!
ఒక్కో చోట ఆధిక్యతలు వెలువడుతున్నాయి.
రౌండు రౌండు కి పెరుగుతూ వస్తున్నాయి ఆధిక్యతలు.
మహామహులు..రాజకీయ దురంధరులు..ఓట్ల వేటలో వెనుకబడిపోతున్నారు.
ఎన్టీఆర్ రెండు చోట్ల భారీ ఆధిక్యం కనపరుస్తున్నారు.
అంతటా ఉత్సాహం నెలకొన్నది.
సమయం గడిచే కొలది అన్ని వైపుల నుండి సమాచారం వస్తున్నది.
ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు..ఒకే వేవ్!
కాంగ్రెస్ శ్రేణులు డీలా పడిపోయారు.
సీనియర్ నాయకులు..ఒక్కొక్కరు వెనుకబడుతుంటే హాహాకారాలు..నిట్టూర్పులు..నిరాశ గొణుగుళ్ళు.
ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు..శ్రవణానందకరంగా ఉన్నాయి.
మెల్లగా కాంగ్రెస్ మద్దతు దారులు జారుకున్నారు.
అర్ధరాత్రి సమయానికి స్పష్టత వచ్చేసింది..ఫలితాలు వెల్లడి కాక పోయినా..!
తెల్లవార్లూ జాగారం చేసి ..పట్టరాని సంతోషం పొందాము.
అన్ని వార్తాపత్రికలు..తెలుగుదేశం సూపర్ హిట్టు..
తెలుగుదేశం ప్రభంజనం..అంటూ పతాక శీర్షికలు పెట్టాయి.
అప్పుడు కూడా ఒక పత్రిక ..ఆంధ్రభూమి అనుకుంటా…లెక్కింపు కొసాగుతుంది..ఇంకా ఫలితాలు వెల్లడి కావాలన్నట్టు హెడ్డింగ్ పెట్టారు.
వాడవాడలా ..పసుపు జెండా ఎగిరింది.
రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చింది.
డాక్టర్లు..ఇంజినీర్లు..లాయర్లు..ఉపాధ్యాయులు..ఇంకా అనేక మంది విద్యావంతులు..టీడీపి ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టి రాజకీయాల్లో రాణించారు.
ఆనాడు..ఫలితాల వెల్లడయ్యే రోజు పొందిన అనుభూతి..మధురస్మృతి..!
ఈసారి..మరోసారి..అలాంటి ప్రభంజనం చూస్తాం.. కొత్తరక్తం.. కొత్తమొఖాలు చూస్తాం..!
– కంకణాల శ్రీనివాసరావు