Suryaa.co.in

Features

ఒక్క కండువా.. ఎన్ని ఉపయోగాలో!

ఎడమ వైపు వేసుకుంటే భార్య జీవించి ఉంది అని అర్థం.
కుడివైపు వేసుకుంటే భార్య చనిపోయింది అని అర్థం.
రెండువైపులా వేసుకుంటే గౌరవ సూచకం.
నెత్తి మీద వేసుకుంటే దివాలా తీసినట్టు, లేదా విచారంగా ఉన్నట్టు.
తలకు చుట్టుకుంటే పాగా వేసేసినట్టు.
ముఖం చుట్టూ కట్టుకుంటే, ఎండలో గానీ చలిలో గానీ రక్షణ కల్పించుకున్నట్టు.
నడుముకు చుట్టుకుంటే వీరత్వం ప్రదర్శిస్తున్నట్టు.
తలకు చుట్టుకుని చెవులను కవర్ చేసి, గడ్డం దగ్గర ముడి వేస్తే చలి బారినుండి రక్షించుకున్నట్టు.
తలకు చుట్టుకుని వెంక ముడి వేసి అంచులు వేలాడదీస్తే, దుమ్మునుండి రక్షణ కల్పించుకున్నట్టు.
తల- ముక్కులను రెండూ కవర్ చేస్తే, మీ ముఖం ఎవరూ గుర్తు పట్టకూడదు అని భావిస్తున్నట్టు.
ముక్కును మాత్రం కవర్ చేస్తే, చాలా అపరిశుభ్రమైన వాతావరణం లో మీరు ఉన్నట్టు.
కూర్చుని కండువా ఎడమ భుజం మీద వేసుకుని, రెండు చేతులతో అంచులు పట్టి ఉంటే, ఆశీస్సులు కోరుతూ అక్షతలు అర్దిస్తున్నట్టు.
కూడా బ్యాగ్ లేకపోతే.. ఏదైనా వస్తువు మూటకట్టుకోడానికి ఉపయోగపడుతుంది.

LEAVE A RESPONSE