Suryaa.co.in

Political News

ఒక ఊడ్ రో విల్సన్ .. మరో కార్ల్ మార్క్స్.. ఇంకో సిగ్మాండ్ ఫ్రాయిడ్ వైఎస్

వ్యవస్థలని పునర్నిర్మించిన ఊడ్ రో విల్సన్
రాజ్యాంగాన్ని తిరగదోడిన అభినవ అంబేద్కర్.
కోపం నరం తెంపేసుకున్న రాయలసీమ గాంధీ
రిలయన్స్ వంటి బడా కార్పోరేట్ శక్తులని ఎదుర్కున్న భగత్ సింగ్
తెలంగాణ ఏర్పాటు కోసం చిన్నారెడ్డి ని సోనియా వద్దకు కే సీ ఆర్ కన్నా ముందే తెలంగాణ కోసం పోరాడిన కడప నేతాజీ
తప్పు తెలుసుకుని తెలంగాణ కి పోవాలి అంటే వీసా కావాలి అని నినదించిన పులివెందుల పొట్టి శ్రీరాములు
ప్రత్యర్ధులను లొంగదీసుకోవాడిని ఆర్థిక పునాదుల మీద కొట్టిన కార్ల్ మార్క్స్
మీగడ నాకేసి మజ్జిగ పంచి కొన్ని వర్గాలకి దేవుడైన కార్ల్ మార్క్స్
తింటే తప్పెంటయ్యా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నాం అని తింటే తిన్నాడు మాకు పంచాడు అని జనాల సైకాలజీని మార్చిన సిగ్మాండ్ ఫ్రాయిడ్
భూములని ఎలా వాడాలో ఎలా పంచాలో తెల్సిన హెర్క్యూలెస్
జనాలు పడి మునిగిపోతారేమో హైద్రాబాద్ చెరువులన్నీ కుంటలన్ని మూసేయించిన పర్యావరణ ప్రేమికుడు
హత్యలు జరిగితే వాటికి చారిత్రక కారాణాలు ఉన్నాయ్ అని చెప్పిన హీరోడోటాస్
అయిన రాజశేఖర్ రెడ్డి ఎందుకో గుర్తుకొస్తున్నారు.

( మిత్రుని ముఖపుస్తకం గోడ నుంచి సేకరణ)

LEAVE A RESPONSE