వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి.. రాష్ట్ర యువతను తట్టి మేల్కొలిపి వారికి జరుగుతున్న నష్టంపై అవగాహన కల్పించడానికి.. వైసీపీ రాబందుల చేతిలో నలిగిపోతున్న రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పడానికి యువనేత నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర పూర్తయ్యి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను. ఎన్నో నిర్బంధాలు, దాడులు, కుట్రలను ఛేదించుకుంటూ సాగిన ఈ పాదయాత్ర ఆంధ్రరాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల చెరలో నుండి విడిపించేందుకు యువగళం పాదయాత్ర ఏవిధంగా దోహదపడిందో చెప్పడానికి నేనొక ప్రత్యక్ష సాక్షిని కావడం నా పూర్వజన్మ సుకృతం. రాక్షస పాలకులను ఊహకందని రీతిలో ఓడించడంలో యువగళం పాదయాత్ర కార్యక్రమానిది సింహభాగం. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే ఉద్దేశంతో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, అభినందనలు.
– బాలాజీ నాయక్
టీడీపీ ఎస్టీ సెల్ సెక్రటరీ