– హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు
– 5000 పైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించింది
కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ
హైదరాబాద్: హైడ్రాకు సంబంధించి ఇప్పటివరకూ జరిగిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, చెరువుల పరిరక్షణ, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై హైడ్రా కమిషనర్ ఏఆర్ రంగనాధ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకారంగా.. హైడ్రా రాక ముందు (before July 2024) అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు.అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదు.(ఈ వివరాలన్నీగూగుల్ earthలో / క్షేత్ర స్థాయిలో పరిశీలించి చెక్ చేస్తాం).
అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం (ఉదాహరణకు N Convention) ఎప్పుడు కట్టినా FTLలో ఉంటే కూల్చడం జరుగుతుంది.గతంలో అనుమతులు ఇచ్చి.. తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు అక్రమ కట్టడాలు అవుతాయి. అవి నివాసాలు అయినా సరే.. జులై తరువాత నిర్మాణం జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చడం జరుగుతుంది. (కత్వా చెరువు , మల్లంపేట లో , Ameenpur లో కూల్చివేత లు ఈ కేటగిరీ లోకి వస్తాయి).
పేదలను ముందు పెట్టి.. వెనుకనుండి చక్రం తిప్పుతున్న ల్యాండ్ grabbers చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. (ఉదా.. చింతల చెరువు, గాజులరామారం, మాదాపూర్ లోని సున్నం చెరువులో కూల్చివేతలు ఈ కేటగిరీలోకి వస్తాయి).
కోర్టు ఉత్తర్వులుంటే ఎలాంటి కట్టడాలైనా కూల్చడం జరుగుతుంది. (ఉదా.. నిజాంపేట్ లోని ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ కూల్చివేత).
హైడ్రా ఆవిర్భావం తర్వాత (after జూలై 19 th 2024) అనుమతి ఇచ్చి ఉన్నా, లేకున్నా FTL లో వుంటే కూల్చడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయటం జరుగతుంది.
FTL పరిధిలో అనుమతి లేకుండా ఉన్న commercial కట్టడాలు (like N convention , Farm houses/ resorts etc ) హైడ్రా కూల్చి వేస్తుంది. హైదరాబాద్ లో చెరువుల FTL మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టింది. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. త్వరలో యీ ప్రక్రియను పూర్తి చేస్తాం.
కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుంది. హైడ్రా కూల్చివేతలు చేసిన తరువాత, ఆ ప్రాంతం ప్రజావసరాల కోసం వినియోగంలోకి వచ్చేలా హైడ్రా ప్రాధాన్యతను యిస్తుంది. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టాం.. ఆ చెరువుల పునరుద్దరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. చెరువులు, పార్కులతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి సంస్థ దేశంలోనే మొట్ట మొదటిది.
గత 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోంది. ఏమన్నా లోటు పాట్లు ఉంటే వాటిని సవరించుకొని మరింత దృఢంగా నిబద్ధతతో పని చేస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన పలు తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోంది. భావితరాల భవిష్యత్ బాగుండాలని, పర్యావరణ హితమైన,మెరుగైన ప్రజా జీవనం కోసం నగర ప్రజలు హైడ్రా కు సహకరిస్తున్నారు. ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు హైడ్రా పని చేస్తుంది. హైడ్రాను బలోపేతం చేయడానికి వివిధ చట్టాల కింద ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెడుతూ వస్తోంది.
టెక్నాలజీ పరంగా కూడా స్ట్రాంగ్ అవుతున్నాం. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల(చెరువు/ ప్రభుత్వ భూములు/ పార్కు)ను స్వాధీనం చేసుకున్నది. ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రా పై నమ్మకం తో ఫిర్యాదులు చేస్తున్నారు. యిలా 5000 పైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించింది. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటున్నాం. ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపిం చే దిశగా హైడ్రా పని తీరు వుంటుంది. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. భూ కబ్జాల వెనక ఉన్న పాత్ర దారులు, సూత్ర దారుల మీద చట్ట పరంగా చర్యలు హైడ్రా తీసుకుంటుంది.