Suryaa.co.in

Andhra Pradesh

అనంతబాబు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది

– పోలీసులు షీట్ వేయకుండా నీరుగారుస్తున్నారు
– ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు

చట్ట ప్రకారం అనంతబాబు కేసుపై మా పోరాటం మేము చేస్తున్నాము.10 ఏళ్ళ పైబడి శిక్షలు పడే నేరాలు అన్నిటికీ విచారణ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి.కానీ అనంతబాబు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 90 రోజులు గడుస్తున్నా…ఛార్జ్ షీట్ వెయ్యకపోతే ముద్దాయిని బెయిల్ పై విడుదలకు చట్టం చెబుతుంది….పోలీసులు షీట్ వేయకుండా నీరుగారుస్తున్నారు.
సెంట్రల్ జైల్ లో రాజభోగాలు అనుభవిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం త్వరలో ఆధారాలతో బయటపెడతాం. మే నెలలో హత్య అనంతరం జరిగిన ప్రదేశాల్లో సిసి ఫోటేజ్ సేకరించారు….అనంతబాబు భార్య కూడా సిసి లో ఉన్న ఇప్పటివరకు.విచారించలేదు… మే 23 న సుబ్రహ్మణ్యం చనిపోయాక…కర్రతో కొట్టానని ఎమ్మెల్సీ చెప్తే….పిపి.రిపోర్ట్ లో హత్య చేయకముందే గాయాలు ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది…
అనంతబాబు పై గతంలో ఉన్న రౌడీ షీట్ నెంబర్ 62 ఉన్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ అధికారి కనీసం రాయలేదు. అతికిరతకంగా సుబ్రహ్మణ్యం ని హత్య చేసిన అనంత బాబు కు పోలీసులు కొమ్ము కాస్తున్నారు…న్యాయ పరంగా మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాము…. ప్రభుత్వ ఒత్తిడి వల్ల అనంత బాబు కేసు విషయంలో డిజిపి కూడా ఏమీ చేయట్లేదని మా అభిప్రాయం.

LEAVE A RESPONSE