తెలుగు సినిమా పాటల వివరాల బాంక్ ఊటుకూరి వెంకట సత్యనారాయణ!
తెలుగు సినిమా రచయితలు, కవులు గాయకులు, సంగీత దర్శకులు… వీటి పూర్తి సమాచార ‘నిఘంటువులు’ తయారు చేసిన గొప్పవారు ఊటుకూరి వెంకట సత్యనారాయణ!
ఊటుకూరి వెంకట సత్యనారాయణ తెలుగు సినిమాకు నిస్స్వార్థమైన ‘సేవ’ చేసిన అరుదైన వ్యక్తులలో ప్రథములు.
ఊటుకూరి వెంకట సత్యనారాయణ సినిమా జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కాదు; ఆయన తెలుగు పాత్రికేయుడు కాదు; సినిమా రంగానికి సంబంధించిన వారు కాదు; తెలుగు రాష్ట్రాలకు, దేశానికి దూరంగా ఆస్ట్రేలియా లో గత పలు దశాబ్దులుగా వసిస్తున్నారు!
అందుకే ఆయన నాసిరకం, అతి-తెలివి, అజ్ఞానం, ధూర్తత్వం వీటికి అతీతంగా… నిజాయితీగా, పరిశ్రమతో తెలుగు సినిమాకు సంబంధించిన విషయాలపై పలు నిఘంటువులు సిద్ధం చెయ్యగలిగారేమో అని అనిపించడం కాదు, అందువల్లే చెయ్యగలిగారు అని నిర్ద్వంద్వంగా చెప్పచ్చు.
‘తెలుగు సినిమా ఫస్ట్ రీల్’ అన్న పేరులోనే తన ‘చదువు లేమి’ని గట్టిగా తెలియజేస్తూ ఇటీవల రెంటాల జయదేవ అన్న సీనియర్ జర్నలిస్ట్ ఒక పుస్తకం(?)తో తెలుగు సినిమాకు తీవ్రహానికరమైన ప్రయత్నం చేశాడు. ఆ అజ్ఞానపు, అతి-తెలివి, దురాలోచనల పన్నాగానికి లేదా ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వ పురస్కారాన్ని కూడా పొందాడు. ‘తెలుగు సినిమా ఫస్ట్ రీల్’ అన్న పేరులోనే చదువు లేమి ఉందని కూడా తెలియని కొందరు ప్రబుద్ధులు ఆ పుస్తకంపై తమ అజ్ఞానంతో, అతి-తెలివితో సమీక్షలు కూడా రాసేశారు.
రెంటాల జయదేవ వంటి కొందరు విపరీత మేధావులు ఏదో లబ్ది కోసం పనిగట్టుకుని తెలుగు సినిమా చరిత్రకు తీవ్రమైన హాని చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఊటుకూరి వెంకట సత్యనారాయణ విశేషమైన కృషి, నిజాయితీ నిండిన పనితీరు, పనితనంతో తెలుగు సినిమా చరిత్రకు మేలైన సేవ చేశారు.
ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారిపై ఈ టీ.వీ. స్నిపెట్ చూడండి. నిజానికి ఈ స్నిపెట్ తెలియజేస్తున్న దాని కన్నా ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారి అంకిత భావం, పనితనం, ఫలితం ఎంతో గొప్పవి.
“నా పుస్తకానికి సమీక్ష రాయండి, నేనే ఏదో పత్రికలో వేయించుకుంటాను” అని కనిపించినవాళ్లందరినీ అడుక్కుంటే సమీక్షలు వస్తాయి; సిగ్గులేని పైరవీలు చేసుకుంటే విఫలమైన పుస్తకాలకు, చెత్త పుస్తకాలకు కాడా అవార్డులు వస్తాయి… సమీక్షలు, అవార్డులు ఎలా వస్తాయో అందరికీ తెలిసిందే.
ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారు చదువు, సంస్కారం, నిజాయితీ, అంకిత భావం ఉన్న ఉన్నతస్థాయి వ్యక్తి. ఒక ఉన్నత స్థాయి వ్యక్తి పనితనం ఎలా ఉంటుందో ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారి పలు పుస్తకాలు ప్రత్యక్ష ఋజువులు.
– రోచిష్మాన్
9444012279