Suryaa.co.in

Political News

ఎన్డీఏ రాజకీయ చతురతకు విపక్షాలు విలవిల…

రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ఎన్డీఏలో లేని పార్టీలు మద్దతు ఇవ్వడంతో, విపక్షాల గింగిరాలు తిరిగి, తికమక పడి ఏమి చేయాలో పోలు పోక తలలు పట్టుకుంటున్నాయి.

ఎన్డీఏ బలం 48.1%. గెలవాలంటే 50% దాటాలి. ఎన్డీఏ పక్షాలు అభ్యర్థిని నిలబెట్టకముందు.. 23 ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ అభ్యర్థిని ఓడించవచ్చని, కాంగ్రెస్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్టులు లాంటి పార్టీలు కలలుగన్నాయి. కానీ ఎన్డీఏ పక్షాలు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని నిర్ణయం చేసిన తర్వాత ప్రతిపక్షాల గొంతులో వెలక్కాయపడింది .

దేశంలో అట్టడుగు స్థాయి సామాజిక వర్గం గిరిజన తెగకు చెందిన సంతాల్ కులం అభ్యర్థిని నిర్ణయం చేసిన తర్వాత, ప్రతిపక్షాలకు ఊహించని షాక్ తగిలింది ఎన్డీఏ పక్షాల రాజకీయ చతురత ఎలా ఉందో వారికి అర్థమైంది .

ప్రతిపక్షాలకు మొదట్లో అభ్యర్థి దొరక్క రాజమోహన్ గాంధీని అడిగితే… వారు నేను పోయినసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడు చేతిలో ఓడిపోయాను, నేను నిలబడను అని చెప్పడం జరిగింది . కాశ్మీర్ కు చెందిన ముస్లిం అభ్యర్థి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ని అడిగితే, నేను జమ్మూ కాశ్మీర్ వరకే పరిమితం అని వారు చెప్పడం , మహారాష్ట్రకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎన్సిపి నాయకుడు శరద్ పవార్ ని నిలబడమంటె, వారు కూడా నేను మహారాష్ట్ర రాజకీయాల వరకు పరిమిత మవుతానని చెప్పడం మనం చూసాం.

ఇకపోతే ఒకప్పటి వాజ్ పాయ్ ప్రభుత్వంలో, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న యశ్వంత్ సిన్హా ని అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిలబెట్టాయి. ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే 50% కంటే ఓట్లు ఎక్కువ రావాలి. అలాంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ , జార్ఖండ్ , ఒరిస్సా రాస్ట్రాలు ద్రౌపది మురుముని బలపరిచేసరికి, వారి గెలుపు నల్లేరు మీద నడకైపోయింది .వారికి ఖచ్చితంగా 60% దాటి ఓట్లు వస్తాయి. జార్ఖండ్ రాష్ట్రంలో అయితే జేఎంఎం, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి . కానీ వారు కాంగ్రెస్ పార్టీ మాట తీసుకోకుండా, జే ఎమ్ ఎమ్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి బలపరుస్తున్నారు. అదే విధంగా చత్తీస్ ఘడ్ లో ఉన్నటువంటి గిరిజన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులు ఆలోచనలో పడిపోయారు.

అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లో 5 పార్లమెంట్ , 80 అసెంబ్లీ నియోజకవర్గాలలో ద్రౌపది ముర్ము తెగ చాలా ఎక్కువగా ఉంది . అందుకనే మమత బెనర్జీ కూడా ముందుగా మాకు ద్రౌపది ముర్ము ఎన్ డి ఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తున్న తెలిసి ఉంటే, మేము అభ్యర్డి ని పెట్టి ఉండే వాళ్ళం కాదు అని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఇకనైనా విపక్ష పార్టీలు దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మోడీ , అమీత్ షా లాంటి పెద్దలు దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వారు అభ్యర్థిని నియమించారని దేశ ప్రజలకు , ప్రతిపక్ష పార్టీలకు అర్థమైంది .

కరణం భాస్కర్
బిజెపి .
మొబైల్ నెంబర్ 7386128877 .

LEAVE A RESPONSE