Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైట్‌ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు శుభవార్త చెప్పింది. వారికి చక్కని పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో సమకూర్చే డైట్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలకు ఇవి రెండింతలు కానున్నాయి.

ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు రెండింతలు..అన్ని బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్‌ ఆసుపత్రుల్లో ఈ పెంచిన మొత్తాలు అమలవుతాయి.అన్ని విభాగాల రోగులు, గిరిజన రోగుల సహాయకులకు ప్రస్తుతం రోజుకు రూ.40 చెల్లిస్తుండగా.. దీన్ని రోజుకు రూ.80కు పెంచారు.

క్షయ, మానసిక, క్యాన్సర్‌ తదితర రోగులకు మరింత పుష్టికరమైన ఆహారాన్ని అందించాల్సి ఉండగా.. వీరికి ప్రస్తుతం రోజుకు రూ.56 అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.112కు పెంచారు.ఇక విధుల్లో ఉండే వైద్యులకు ప్రస్తుతం రోజుకు రూ.80 చెల్లిస్తుండగా.. దీన్ని రూ.160కు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు.

LEAVE A RESPONSE