పాము కాటుతో ఓయూలో ఉద్యోగిని మృతి

లేడీస్ హాస్టల్లో ఎక్కడ చూసినా పాముల బొరియ(స్థావరా)లే. కుకింగ్ చేస్తుండగా కాటు వేసి, బొక్కలోకి దూరిన పాము. పట్టించుకోని ఓయూ, కాంట్రాక్టర్స్ యజమాన్యం. తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లిన మహిళ ఉద్యోగిని నాగోల్ కవిత. రక్తం, బురుసులు కక్కుతూ సొమ్మసిల్లిన ఉద్యోగినిని పట్టించుకోని ఆసుపత్రులు. పలు ఆసుపత్రులు తిరిగిన, ప్రాణం దక్కని వైనం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గంటల్లోనే ఓయూ మహిళ ఉద్యోగిని కవిత మృతి. సమాచారం బయటకు రాకుండా దాచిన ఓయూ ఉద్యోగులు, కాంట్రాక్టర్స్. పాము కరచిన విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు తోటి ఉద్యోగులకు చెప్పిన కవిత. కళ్ళముందే క్షణాల్లో చనిపోయిన ఉద్యోగిని.. లోలోన కూమిలిపోయిన తోటి ఉద్యోగులు. లీక్ కాకుండా జాగ్రత్త పడ్డ మహిళా హాస్టల్ సిబ్బంది, కాంట్రాక్టర్స్. గాంధీ ఆసుపత్రికి చేరుకునేలోగా.. ప్రాణాలు పోయిన వైనం.ఇది అత్యంత బాధాకరం..మృతురాలు కవిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందే. మహిళా ఉద్యోగిని కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, విద్యార్థి సంఘాలు, పలు పార్టీల డిమాండ్. ఓయూ లేడీస్ హాస్టల్ ముందు నిరసన, ధర్నాకు సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాలు, జాక్ నేతలు.