మన అరవింద్ కృష్ణ కు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కీలక బాధ్యతలు
ఐబీఎం చైర్మన్, సీఈఓ “అరవింద్ కృష్ణ” కు, కీలక బాధ్యతలు దక్కాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సోమవారం ప్రకటించింది.
2023 డిసెంబరు 31 వరకు కృష్ణ ఈ పదవీలో కొనసాగుతారని న్యూయార్క్ ఫెడ్ తన ప్రకటనలో పేర్కొంది.
BM CEO, చైర్మన్‌గా కొనసాగుతున్న కృష్ణ..
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజీ నుండి డిగ్రీ పట్టా పొందారు. అలాగే అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో PhD చేశారు. గతంలో క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే IBM రీసెర్చ్‌కు నాయకత్వం వహించారు.
ఐబీఎం సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ అభివృద్ధి, తయారీ సంస్థకు జనరల్ మేనేజర్‌గా కూడా విధులు నిర్వహించారు. ఇక ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ అనేది ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్‌లో మరియు US ఆర్థిక, ఆర్థిక వ్యవస్థల భద్రత, పటిష్టత, చైతన్యాన్ని పెంపొందించడానికి ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
తీగల రవీంద్ర