Suryaa.co.in

Telangana

ప్రజాసేవకే మా కుటుంబం అంకితం

-ప్రజా సేవలో ఎర్రబెల్లి ట్రస్టు
-ట్రస్ట్ చేపట్టిన అన్ని కార్యక్రమాలకు విశేష ఆదరణ
-డ్రైవింగ్ లైసెన్సుల జారీకి అనూహ్య స్పందన
-పాలకుర్తి నియోజకవర్గంలో 17 వేల దరఖాస్తులు

ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరులోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద వంగర మండలం లోని పలు గ్రామాల లబ్ధిదారులకు భోజనాలు వడ్డించి, లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉషా దయాకర్ రావు దంపతులు

తొర్రూరు ఆగస్టు 9: ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం లో ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని, ఆయా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని, అందుకు ఉదాహరణ ఈనాటి డ్రైవింగ్ లైసెన్సుల ఉచిత జారీ కార్యక్రమమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు దంపతులు పేర్కొన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం లో యువతకు ఉచితంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లోని
ఆర్ అండ్ బి అతిథి గృహంలో పెద్ద వంగర మండలంలోని పెద్ద వంగర మండలంలోని పోచారం, బొమ్మకల్, కాన్వాయ్ గూడెం, అర్ కే తండా, మోత్యా తండా, ఎల్ బి తండా, పడమటి తండా, బి సి తండా, భావోజి తండా లకు చెందిన 210 మందికి ఉచిత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను మంత్రి దంపతులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు చేపట్టిన అన్ని కార్యక్రమాలు దిగ్విజయం అయ్యాయని, మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. తమ కుటుంబం పూర్తిస్థాయిలో ప్రజాసేవకే అంకితం అయిందని అన్నారు. గతంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం లో ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ఆరోగ్య శిబిరాలు, కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ, ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ, ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ వంటి కార్యక్రమాలు అనేకం విజయవంతంగా పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించామని అవన్నీ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మిగిలాయని మంత్రి చెప్పారు.

ప్రజలకు సేవ చేస్తే అది వృథా కాదని ప్రజలు కచ్చితంగా వాటిని గుర్తు పెట్టుకొని తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తారని మంత్రి అన్నారు. తాను తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ద్వారా సేకరించిన డబ్బును ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నామని చెప్పారు.

ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని మంత్రి అన్నారు. అందుకే తాను నిరంతరం ప్రజా సేవలో ఉంటూనే ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా గెలుస్తూ ఇవాళ మంత్రిగా ఉన్నానని ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలు తనకి ఎప్పుడు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు  మాట్లాడుతూ తాము ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ కార్యక్రమాన్ని ప్రకటించగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి దాదాపు 17వేల దరఖాస్తులు అందాయి అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా దరఖాస్తులు స్వీకరించి, స్లాట్ బుక్ చేసి, పరీక్షలు నిర్వహింపజేసి, పైసా ఖర్చు లేకుండా యువత కు లైసెన్సులు ఇప్పిస్తున్నామని చెప్పారు.

అనంతరం ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన భోజనాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఉషా దయాకర్ రావు దంపతులు స్వయంగా వడ్డించి, యువత ను ఆప్యాయంగా పలకరించి, వారి బాగోగులు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్సులు పొందిన అభ్యర్థులు, సంబంధిత శాఖకు చెందిన అధికారులు, పలువురు ప్రజలు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రత్యేకించి యువకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE