టిడిపి సభ్యత్వం తీసుకుందాం… మన భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం
కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప హాజరయ్యారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ… మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్, బూత్ ఇంచార్జ్ మరియూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించిన విధంగా 1,00,000రూపాయలతో శాశ్వత సభ్యత్వం మరియు 100రూపాయలతో సాధారణ సభ్యత్వం చెల్లించి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా, తక్షణ సహాయం పదివేల రూపాయలు లబ్దిపొందే అవకాశం కల్పిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమమును దిగ్విజయవంతం చేయగలరని మరీ మరీ కోరుకుంటూన్నాను అని తెలిపారు.