– డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రెండో విడతలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఎంపికైన లబ్దిదరులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖాముఖీగా ముచ్చటించారు. లాలాపేట స్టేడియం నుంచి బస్సుల ద్వారా లబ్దిదారులను జవహర్ నగర్ కు తరలించారు. లాలాపేట స్టేడియం లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లబ్దిదరులతో ముచ్చటించారు.
లబ్దిదారులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కిరాయి ఇళ్ళలో నివసిస్తూ చాలీ చాలని సంపాదనతో గడుపుతున్న తమకు డబుల్ బెడ్ రూమ్ లభించడం వరంగా మారిందని పెద్ద సంఖ్యలో లబ్దిదారులు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తూ పద్మారావు గౌడ్ కు, సీ ఎం కెసిఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. కేవలం పేదలకు మంచి సదుపాయాలను కల్పించేందుకే ప్రభుత్వం శ్రమిస్తోందని, దశల వారీగా లాటరి ప్రక్రియ ద్వారా అర్హులకు మాత్రమే ఇళ్ళను అధికారులు కేటాయిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ, జీ హెచ్ ఎం సీ అధికారులు, నేతలు పాల్గొన్నారు.