Suryaa.co.in

Telangana

మా మేయర్ కనిపించడం లేదు

– జీహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మిపై బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని, కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

కనీసం కార్యాలయంలో కూడా ఆమె అందుబాటులో ఉండకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అన్నారు. పలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, చెత్త సమస్య, రోడ్ల దుస్థితి వంటి అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వివిధ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారం కోసం ఆమె స్వయంగా పర్యటించడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మేయర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE