Suryaa.co.in

Andhra Pradesh

ఆర్యవైశ్యుల అభివృద్ధే మా ధ్యేయం

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : ఆర్యవైశ్యుల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్, డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డూండి రాకేశ్ నియమితులైన విషయం తెలిసిందే. గురువారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను డూండి రాకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

తన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ తో పాటు మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు.

పార్టీ కార్యక్రమాలనూ విజయవంతం చేస్తానని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన డూండి రాకేశ్ మంత్రి సవిత అభినందించారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యుల అభివృద్ధదికి ఆది నుంచి సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ను చంద్రబాబు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

2014-19 మధ్య ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.30కోట్ల మేర నిధులు వెచ్చించారన్నారు. ప్రస్తుత బడ్జెట్ లోనూ రూ.168 కోట్లు కేటాయించారన్నారు. ప్రభుత్వం అందజేసే పథకాలకు క్షేత్ర స్థాయిలోకితీసుకెళ్లాని డూండి రాకేశ్ కు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE