హై హై నాయకా..
ఆటకూటి దెయ్యాలు..
హై గురు..వై జియా..
డింగరి..వీరతాళ్ళు…
కంబళి..గింబళి..
ఇలాంటి ఎన్నో మాటల కలగలుపు పింగళి..
ప్రతి డైలాగు భళా భళి..!
విజయావారి సినిమాల్లో..
రాజన్ శృంగార వీరన్..
కొత్త మంత్రి ప్రగ్గడ
మత్తెక్కించే పిలుపు..
ఉప్పు తింటున్న వాణ్ణి
పాత మంత్రి ఆవేదన..
ఉప్పేం ఖర్మ
అంత జీతం ఇస్తుంటే
పంచదారే తినండి..
త్రిశోకుడి సూచన..
అన్ని మాటలూ ఇష్టమే
పరాకాష్టగా
సాహసం సేయరా డింభకా..
నరుడా ఏమి నీ కోరిక
ప్రతి మాట వరాల మూట..
పింగళి నాగేంద్రుడి జాలం
సినిమాని హిట్టు కొట్టించిన జాదు మలాం..!
ముక్కోపానికి విరుగుడు
ఉండనే ఉందిగా ముఖస్తుతి
ఓ పింగళీ..
ఏమని చేతు
నీ స్తుతి!?
వివాహ భోజనంబు..
ఒక్క పాట చాలు..
వంటలు కళ్ళకు కట్టినట్టు
వాటి రుచులు
నాలిక్కి అంటినట్టు..
ఇయెల్ల నాకె చెల్లు
అలా రాయడం
పింగళికే చెల్లు
దాంతోనే మాయాబజార్ రోజుల తరబడి హౌస్ ఫుల్లు!
పాతాళభైరవిలో ఎస్వీఆర్
నవతరం మాంత్రికుడు
పింగళి తొలితరం
మాటల మాంత్రికుడు..
పౌరాణికంలో
వాడుక పదాల ప్రామాణికం..
జానపదంలో
అసలైన పల్లెపదం
సాంఘికంలో సరళ సరస
నవరసాలు..
పింగళి కలం నుంచి జాలువారిన పాదరసాలు
మూడు తరాలను
అలరిస్తున్న మధురసాలు..
ఇన్నిన్ని వింతైన..పసందైన
మాటల మూటలను
మనకు కట్టి ఇచ్చిన
నాగేంద్రుడికి
సత్యపీఠం సాక్షిగా
ప్రియదర్శిని తోడుగా
జోహార్..
ఓ మహాకవీ..
జై పాతాళభైరవి!
(మహారచయిత పింగళి జయంతి)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286