Suryaa.co.in

Telangana

మా విజయం తధ్యం.. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఖాయం

– ప్రజా సంక్షేమo, రికార్డు స్థాయిలో అభివృదే మాకు రక్ష
– డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు ధీమా

తార్నాక : గడచిన 50 సంవత్సరాల కాలంలో చేపట్టలేని అభివృది పనులను కేవలం 9 సంవత్సరాల్లో ప్రారంభించి సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృది లో కొత్త దశ, దిశ చేపమని సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస అబ్యర్ది, డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా సోమవారం తార్నాక డివిజను పరిధిలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.

వివిధ ప్రదేశాల్లో మహిళలు సంప్రదాయబద్దంగా మంగళ హారతులు పట్టి స్వాగతం పలకడంతో వివిధ ప్రాంతాలు గులాబీ మయంగా మారాయి. ప్రజల నుంచి అపూర్వ స్పందన లబించడం తో పద్మారావు గౌడ్ తో పాటు బీఆర్ ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఉపకరించే సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతోందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకొనేలా తాము చొరవ చూపి ఏర్పాట్లు చేశామని తెలిపారు. తమ కార్యాలయాన్ని నిరంతరం ప్రజలకు అందుబాటులో నిలిపెలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాము ఇవ్వని హామీలను కూడా అమలు జరిపామని, ప్రజల అవసరాలను గుర్తించే ప్రభుత్వం గా నిరుపేదల గుండెల్లో నిలిచి పోతామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వానికే ప్రజారంజకమైన పాలనను అందించిన ఘనత దక్కుతుందని పద్మారావు గౌడ్ వివరించారు.

సబ్బండ వర్ణాలకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జంట నగరాల్లో వివిధ ప్రాజెక్టులు చేపట్టామని, కోతల్లేని విద్యుత్ సరఫరా తమ ప్రభుత్వానికే సాధ్య పడిందని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కొత్తగా జూనియర్, డిగ్రీ కాలేజీ లను నెలకొల్పామని, తుకారాం గేట్ ఆర్ యు బీ నిర్మించామని, వివిధ ప్రదేశాల్లో ఫంక్షన్ హాల్స్, ఆసుపత్రుల నిర్మాణాలు ప్రారంభించమని, లాలాపేట రోడ్డును విస్తరించి చుపామని తెలిపారు. చంద్రబాబు నగర్ ను వివిధ సందర్భాల్లో సందర్శించి శిధిల స్థితికి చేరిన పాత ఇళ్ళను ఖాళీ చేయాలనీ, కొత్త ఇళ్ళను నిర్మిస్తామని గతంలో పేర్కొన్నామని గుర్తు చేశారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ పధకాలతో పటు పేదల వైద్యానికి ఉపకరించేలా cmrf నిధులను రికార్డు సంఖ్యలో సికింద్రాబాద్ లో లబ్ది దారులకు కేటాయించమని తెలిపారు. కేవలం 9 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే వందల కోట్ల రూపాయల అభివృది పనులకు శ్రీకారం చుట్టామని, ఆయా పనులన్ని పూర్తీ చేసేందుకు తమకు మరోసారి ఎం ఎల్ ఏ గా అవకాశాన్ని కల్పించాలని పద్మారావు గౌడ్ విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కంది శైలజ, రాసురి సునీత లతో పాటు బీరాస సీనియర్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

లాలాపేట, సత్య నగర్, లక్ష్మి నగర్, సిరిపురి కాలనీ, చంద్ర బాబు నగర్, తదితర ప్రాంతాల్లో పద్మారావు పాదయాత్ర సాగింది. ప్రజలు స్వచ్చంధంగా తరలి వచ్చి దీవెనలు అందించడంతో పలు సందర్భాల్లో పద్మారావు గౌడ్ ఉద్విగ్నతకు గురయ్యారు. తనకు ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు అగ్ర నాయకుల నుంచి ఆదరణ లభించేందుకు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల అశీస్సులె కారణమని పేర్కొంటూ వారికీ తను ఎల్లవేళలా రుణ పది ఉంటానని, మరో సారి అవకాశాన్ని కల్పించాలని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE