Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాసంకల్పయాత్రకు ఆరేళ్ళు పూర్తి

వేడుకగా నిర్వహించిన వైయస్సార్ సిపి శ్రేణులు
ప్రజలు ఇచ్చిన సమాచారంతోనే పార్టీ మేనిఫెస్టో జగన్ రూపొందించారు
మేనిఫెస్టోను బైబిల్,ఖురాన్,భగవద్గీతగా భావించి పనిచేస్తున్నారు
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల సమస్యలను చిరునవ్వుతో విన్నారు
వాటిలో 98 శాతంకుపైగా నెరవేర్చారు
ప్రజాసంకల్పయాత్ర 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో శాసనమండలిలో ప్రభుత్వ ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఎంతగానో దోహదం చేసిందని శాసనమండలిలో ప్రభుత్వ ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలియచేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాసంకల్పయాత్ర ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా దివంగత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.కేక్ కట్ చేశారు.కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రలో 341 రోజులలో దాదాపు రెండుకోట్ల మంది ప్రజలను శ్రీ వైయస్ జగన్ కలిశారన్నారు. సమస్యలు చెప్పేందుకు తన వద్దకు వచ్చే ప్రజలను చిరునవ్వుతో పలకరించడమే కాక వాటిని తాను అధికారంలోకి వచ్చాక తప్పక పరిష్కారం చూపుతానని చెప్పారన్నారు.ప్రజలకు అలా మాట ఇవ్వడమే కాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు.ప్రజలు ఇచ్చిన సమాచారంతో పార్టీ మేనిఫెస్టోను రూపొందించారని,మేనిఫెస్టోను బైబిల్,ఖురాన్,భగవద్గీతగా భావించి పనిచేస్తున్నారని తెలిపారు. నిజానికి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనతో వైయస్ జగన్ పనిచేస్తున్నారన్నారు.

కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా,విభజన నేపధ్యంలో ఆర్దిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. సామాజిక సాధికారత సాధించినప్పుడే బడుగు,బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెరుగుతుందని జగన్ భావించారన్నారు. సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలనను తీసుకువచ్చారన్నారు. రైతాంగానికి అనేక ప్రయోజనాలు కలిగే విధంగా పధకాలు అమలు చేస్తున్నారు.పేదలకు విద్య,ఆరోగ్యం అందించేందుకు జగన్ గారు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జగనన్న సురక్ష ద్వారా రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యసేవలను అందుబాటులోకి తెచ్చారన్నారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ తో పాటు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న 9 మందిని శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు రుహుల్లా, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు,ఎస్సీ కమీషన్ సభ్యుడు కాలే పుల్లారావు,పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE