రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్ కేంద్రాలు

– రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలన్నదే టీడీపీ ధ్యేయం
▪️ఇది రైతు దగా ప్రభుత్వం
▪️రైతు మోటర్లకు మీటర్లు బిగించి, రైతుల మెడకు ఉరి మో
▪️ఈనెల 21న జరిగే రైతు పోరును జయప్రదం చేయండి
▪️నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద రైతు పోరు కార్యక్రమం
▪️తెలుగు రైతులు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొనాలని పిలుపు

రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలన్నదే టీడీపీ ధ్యేయం అని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో తెలుగు రైతుల సమావేశం జరిగింది. ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతు భరోసా కేంద్రాలు కాదని..వైసీపీ బ్రోకర్ కేంద్రాలని, వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా కుదేలు చేశారని ధ్వజమెత్తారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ దెబ్బతిన్న రంగం వ్యవసాయ రంగం అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దేశం మొత్తం మైక్రో ఇర్రగరేషన్ ఉంటె..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని నూకసాని ప్రశ్నించారు. రాష్ట్ర లో భూసార పరీక్షలు ఆపివేయడంతో..పంటదిగుడి తగ్గింది. ఎపుడు లేని విధంగా రైతులు క్రాప్ హాలిడే కి వెళ్తున్నారు.
పక్క రాష్ట్రంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయికపోతే..కేసీఆర్ స్వయంగా కొనుగోలు చేశారు. రాష్ట్రంలో రైతుల మెడలకు ప్రభుత్వం ఉరి తాళ్లు బిగిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో 20 వేల కోట్లు కేటాయించి, కేవలం 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఇది ప్రభుత్వ దివాలకోరుతనానికి నిదర్శనం అని అన్నారు. రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర ప్రదేశ్ ముందు వరుసలో ఉంది’ అని ధ్వజమెత్తారు.

‘రైతు సమస్యల పరిష్కారానికి వైకాపా ప్లీనరీలో ఒక్క మాట కూడా లేదు. ప్లీనరీలో వ్యవసాయ మోటర్లకు మీటర్ల రద్దు తీర్మానం ఎందుకు చేయలేదు. మోటార్లకు మీటర్లు పెడితే అన్ని సంక్షేమ పథకాలు రద్దవుతాయి. మీటర్లు ఎవరొచ్చి బిగిస్తారో వారిముందే వాటిని పగలకొడతాం. 3ఏళ్లలో జగన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్కమేలైనా చేశారా అని నూకసాని బాలాజీ ప్రశ్నించారు. ఓట్లు వేయించుకుని జగన్ రైతుల్ని దగా చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రైతులు నష్టపోతున్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాం. గోదావరి-కృష్ణా నదులు అనుసందానం చేసి నీళ్లు అందించాం.

ధాన్యం కొనుగోలు చేయకపోవడం సీఎం జగన్ చేతకాని తనమే. మోటార్లకు మీటర్లకు వద్దని పక్క సీఎం కేసీఆర్ అంటుంటే ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం లేదు. కేంద్రమే మోటార్లకు మీటర్ల అంశంపై వెనక్కి తగ్గింది. కేసీఆర్ ను చూసైనా బుద్ధి తెచ్చుకోవడం లేదు. మోటార్లకు మీటర్లు ఉరితాడు కాబోతున్నాయి’ అని నూకసాని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద ఈ నెల 21 న జరిగే రైతు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.

రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కండ్లగుంట మధుబాబు చౌదరి మాట్లాడుతూ ‘రైతు సోదరులు మేల్కోవాలి. కేసుల మాఫీ కోసం రైతు ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. మీటర్లు బిగింపును రైతులంతా అడ్డుకోవాలి. రైతు భరోసా కేంద్రాలు అధికార పార్టీకి దళారీ కేంద్రాలుగా ఉన్నాయి. వైసీపీలోని రైతులకు కూడా న్యాయం జరగడం లేదు. ధరల స్థిరీకణకు 3వేల కోట్లు, విపత్తులకు 6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. జగన్ జైలుకు వెల్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. రైతులకు టీడీపీ స్వర్ణయుగం చూపించింది’ అని పేర్కొన్నారు. రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు.

రైతు గెలవాలంటే పంటలకు పెట్టే పెట్టుబడి తగ్గాలి. రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్ కేంద్రాలు. రైతులకు మేలు చేసే పరిస్తితి లేదు. భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఎరువులు దొరకడం లేదు. రైతులకు ట్రాక్టర్లు, యంత్రాలను టీడీపీ ప్రభుత్వం అందించింది. పంపుసెట్లు, సోలార్ వంటి ప్రతి వస్తువును అందించి చంద్రబాబు రైతు బిడ్డగా రైతులను ఆదుకున్నారు. రైతులను ఉద్దరిస్తున్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. రైతుల నుండి కొన్న ధాన్యాన్ని కేంద్రానికి అమ్ముకున్నారు. నీ తండ్రి ఉచిత విద్యుత్ పథకాన్ని తెస్తే నువ్వు మీటర్లు పెట్టి తూట్లు పొడుస్తున్నావు. మీకు అధికారాన్ని అప్పగించింది రైతులకు న్యాయం చేయడానికి అన్యాయం చేయడానికి కాదని అన్నారు. రైతు కు న్యాయం కోసమే టీడీపీ రైతు పోరు చేస్తోందని, ఈ నెల 21 న జరిగే రైతు పోరు ను జయప్రదం చేయాలని మధుబాబు కోరారు.

ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. నవరత్నాలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. రైతులకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నా దానికి జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణం. రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతు దగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ధాన్యం బస్తాకు 200లు కమీషన్ వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలే చెప్తున్నారు.

ధాన్యం సేకరణ రైతుకు మద్ధతు దర లేకుండా జరుగుతోంది. దళారులు తయారై ఇష్టారీతిని రైతుల్ని మోసం చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు వస్తే పరిహారం ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమా అని చెప్పి ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతులు పరిహారాన్ని కోల్పోయారు. చంద్రబాబు అసెంబ్లీలో నిరసన తెలిపితే రాత్రికి రాత్రి ప్రీమియం కట్టారు. 30 లక్షల మంది రైతులు బీమాకు అర్హులైతే 15 లక్షల మందికే ఇచ్చారు. జూలై వచ్చినా సబ్సీడీతో విత్తనాలు అందించడం లేదు. టీడీపీ గెలిస్తేనే వ్యవసాయం పండుగ అవుతుంది’ అని తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, తెలుగు రైతు నాయకులు కాకర్ల శ్రీనివాసులు, కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, చిన్న చెంచయ్య, మన్నెం రమణయ్య, చిట్యాల వెంగల్ రెడ్డి, గుంటక రమణారావు, నారపురెడ్డి నాగార్జున్ రెడ్డి, కర్నాటి భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి వల్లభనేని వెంకటసుబ్బయ్య, కార్యదర్శి కేసన శేషమ్మ, టిఎన్టియుసి నాయకులు మొగల్ కాలేషా బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply